రంగ‌స్థ‌లం.. ర‌చ్చో ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్యః..!

Rangasthalam
మొన్న‌టి వ‌ర‌కు థియేట‌ర్స్ లో ర‌చ్చ చేసింది.. ఇప్పుడు అమేజాన్ లో ర‌చ్చ చేస్తుంది.. రంగ‌స్థ‌లం సినిమాకు ర‌చ్చ చేయ‌డం త‌ప్ప మ‌రో ప‌నేదీ లేదు. ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోస్ లో ప్రైమ్ టైమ్ గా మారిపోయింది.
అమేజాన్ ప్రైమ్ వీడియోస్ మొద‌లైన త‌ర్వాత ఇంత హెవీ ట్రాఫిక్ ఉన్న సినిమా మ‌రోటి రాలేదు. ప‌ద్మావ‌త్ విడుద‌లైన‌పుడు కూడా అమేజాన్ లో అరాచ‌కం జ‌రిగింది కానీ రంగ‌స్థ‌లం విడుద‌లైన త‌ర్వాత మాత్రం ఆ ర‌చ్చ మ‌రో స్థాయికి వెళ్లిపోయింది. మే 14 రాత్రి విడుద‌లైనప్ప‌ట్నుంచీ వీక్ష‌కుల సంఖ్య మ‌రీ ఎక్కువ‌గా ఉంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 124 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు టీవీల్లో కూడా దుమ్ము రేప‌డానికి రెడీ అయిపోయింది. అన్న‌ట్లు అమేజాన్ ఈ చిత్రాన్ని ఏకంగా 12 కోట్ల‌కు పైగా రేట్ పెట్టి సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ దూకుడు చూస్తుంటే ఈజీగానే ఆ మ‌నీ రిక‌వ‌ర్ అయ్యేలా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here