రాజుగారిగ‌దిలోకి వెళ్తున్న రాశీఖ‌న్నా..

 
Raas
తెలుగు ఇండ‌స్ట్రీలో రాజుగారిగ‌ది ఒక‌టి ఉంది. అది అంద‌రికీ తెలిసిందే. అదే దిల్ రాజుగారిగ‌ది. ఈయ‌న చిన్న సైజ్ సినిమా ఫ్యాక్ట‌రీనే న‌డుపుతున్నాడు. త‌న రైట‌ర్స్.. ద‌ర్శ‌కుల‌తో ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు దిల్ రాజు. ఒక్క‌రితో ఒక్క సినిమా చేస్తే.. వాళ్ల‌ను అంత ఈజీగా వ‌దల‌డు దిల్ రాజు. హీరోల‌తో పాటు ఇప్పుడు హీరోయిన్ల‌ను కూడా బాగానే లాక్ చేస్తున్నాడు ఈ నిర్మాత‌. ఈ మ‌ధ్యే రాశీఖ‌న్నాపై ప‌డింది దిల్ రాజు చూపు. ఇప్ప‌టికే ఈ ముద్దుగుమ్మ‌తో సుప్రీమ్ సినిమా చేసాడు రాజు. ఆ త‌ర్వాత మొన్నొచ్చిన తొలిప్రేమ‌లో కూడా రాశీఖ‌న్నానే హీరోయిన్. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు కాక‌పోయినా అన్నీ ఆయ‌నే. ఇక ఇప్పుడు నితిన్ హీరోగా స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించ‌బోయే శ్రీ‌నివాస క‌ళ్యాణంలో హీరోయిన్ గా ముందు సాయిప‌ల్ల‌విని అనుకున్నారు ఇప్పుడు ఆమె స్థానంలో రాశీఖ‌న్నాను తీసుకుంటున్నారు.
మ‌రోవైపు రాశీఖ‌న్నా కూడా ఇప్పుడు త‌న‌ను తాను బాగా మార్చేసుకుంటుంది. ఒక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాల కోసం హై రేంజ్ గ్లామ‌ర్ షో చేసిన ఈ భామ‌.. ఇప్పుడు ఎందుకో కానీ సైలెంట్ అయిపోయింది. బాగా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తుంది. తొలిప్రేమ నుంచి రాశీఖ‌న్నా ప‌ద్ద‌తులు మారిపోయాయి. ఇందులో ఎక్క‌డా గ్లామ‌ర్ షో చేయ‌లేదు రాశీఖ‌న్నా. సింపుల్ గా ప‌క్కింటి అమ్మాయిలాగే క‌నిపించింది. వ‌ర్ష కారెక్ట‌ర్ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యేస‌రికి ఇక‌పై కూడా రాశీఖ‌న్నా ఇలాగే కొన‌సాగాల‌ని ఫిక్సైన‌ట్లు తెలుస్తుంది. అందాల ఆర‌బోత‌కు వీలైనంత దూరంగా ఉంటూ అందంగా క‌నిపించాల‌ని చూస్తుంది ఈ భామ‌. కెరీర్ మొద‌లై ఇప్ప‌టికే ఐదేళ్ళైనా ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోలేదు ఈ భామ‌.
స్టార్ హీరోల‌తో న‌టించినా కూడా రాశీకి ఎందుకో కానీ స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. త‌న టైమ్ వ‌స్తుందిలే అని వేచి చూడ‌టం త‌ప్ప మ‌రేం చేయ‌లేక కామ్ గానే ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నాళ్ల‌కు ఆ టైమ్ వ‌చ్చేసింది. తొలిప్రేమ‌తో అమ్మాయిగారు కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ రానే వ‌చ్చింది. ఇక ఇందులో ఈమె వ‌ర్ష పాత్ర‌కు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. దాంతో వ‌ర్ష పాత్ర‌లోనే కొన‌సాగాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక నుంచి కూడా పూర్తిగా యూత్ ఫుల్ రోల్స్ వైపు అడుగులు వేస్తుంది రాశీఖ‌న్నా. ప్ర‌స్తుతం ఈ భామకు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. కాక‌పోతే స్టార్ హీరోలే రాశీ వైపు చిన్న‌చూపు చూస్తున్నారు. నితిన్ శ్రీ‌నివాస క‌ళ్యాణంతో రాశీఖ‌న్నా త‌న‌కు మ‌రో విజ‌యం వ‌స్తుంద‌ని న‌మ్ముతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ భామ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు తీరుతాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here