రాజ్ త‌రుణ్ రౌడీ అవుతున్నాడా..?


తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ న‌డుస్తుంది. త‌మిళ్ నుంచి తెలుగుకు వ‌చ్చిన సినిమాల‌ను మ‌ళ్లీ ఇక్క‌డ రీమేక్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అదేం విచిత్ర‌మో తెలియ‌దు కానీ ఇప్ప‌టికే అలా వీర‌మ్ సినిమాను కాట‌మ‌రాయుడు అంటూ తీసుకొచ్చి బోల్తా కొట్టాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్పుడు తెరీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ర‌వితేజ‌.
సంతోష్ శ్రీ‌నివాస్ దీనికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ చిత్రం తెలుగులో పోలీసోడుగా వ‌చ్చింది. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఇలాగే రాబోతుంది. అదే నానుం రౌడీధాన్. తెలుగులో నేను రౌడీనే అంటూ డ‌బ్బింగ్ చేసారు. మ‌ళ్లీ ఇదే సినిమాను ఇప్పుడు రాజ్ త‌రుణ్ తో రీమేక్ చేయాల‌ని చూస్తున్నారు. నిర్మాత సి క‌ళ్యాణ్ దీని రీమేక్ హ‌క్కులు కొన్నారు. రాజ్ త‌రుణ్ అయితే ఈ క‌థ‌కు బాగుంటాడ‌ని భావిస్తున్నారు వాళ్లు. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా రానుంది.
అస‌లే ఇప్పుడు వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న ఈ కుర్ర హీరోకు ఓ మంచి సినిమా ప‌డ‌టం చాలా అవ‌స‌రం. ప్ర‌స్తుతం దిల్ రాజు బ్యాన‌ర్ లో ల‌వ‌ర్ సినిమా చేస్తున్నాడు రాజ్. దీని త‌ర్వాత నానుం రౌడీధాన్ సినిమా రీమేక్ లో న‌టించే అవ‌కాశం ఉంది. మ‌రి చూడాలిక‌.. అక్క‌డ న‌య‌న‌తార పోషించిన పాత్ర‌ను ఇక్క‌డ ఎవ‌రు చేస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here