రాజ‌మౌళి.. నిజంగా అలా చేస్తున్నాడా..? 

Rajamouli Teasing NTR & Ram Charan Fans!
అవునా.. ఏం చేస్తున్నాడు..? అంత‌గా దాచి పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది రాజ‌మౌళికి.. ఇంత‌కీ ఆయ‌నేం చేస్తున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న త‌ర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. ఇది మామూలు సినిమా కాదు. బాహుబ‌లి లాంటి చ‌రిత్ర త‌ర్వాత ఈయ‌నేం సినిమా చేస్తాడు.. అనుకుంటున్న వాళ్ల‌కు దాన్ని మించే దిమ్మ‌తిరిగే న్యూస్ ఇచ్చాడు. క‌నీసం క‌ల‌లో కూడా ఏ ద‌ర్శ‌కుడు ఊహించని విధంగా చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర క‌థ‌పైనే కుస్తీ ప‌డుతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఈయ‌న సినిమాల‌కు అసిస్టెంట్లే ప్రాణం. ఆయ‌న త‌న సినిమాల కోసం క‌త్తి లాంటి కుర్రాళ్ల‌ను తీసుకుంటాడు. తానేం చేసినా అసిస్టెంట్ల‌కు చెప్పి కానీ చేయ‌డు రాజ‌మౌళి. వాళ్లే ఆయ‌న‌ సినిమాలు ముందుకు న‌డిపిస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు.
త‌న భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప‌క్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నాడు జ‌క్క‌న్న‌.రాజమౌళి త‌న టీమ్ ను రెండు ముక్కలుగా విడకొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ల‌లో ఓ భాగం చ‌ర‌ణ్ కోసం.. మ‌రోభాగం ఎన్టీఆర్ కోసం ప‌గ‌లూ రాత్రి ప‌ని చేయ‌బోతున్నాయి. ఈ సినిమాకు సంబందించి చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ధ్య అద్భుత‌మైన స‌న్నివేశాలు రాయాలంటూ ఇప్ప‌టికే త‌న టీంను రాజ‌మౌళి కోరిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కథ సిద్ధం చేయ‌డంతో.. స్క్రీన్ ప్లే రాయ‌డంలో బిజీగా ఉన్నాడు రాజ‌మౌళి. అంతే కాదు.. ఈ చిత్ర క‌థా చ‌ర్చ‌ల్లో త‌న‌ టీం మొత్తాన్ని ఇన్ వాల్వ్ చేసి అంద‌రి సల‌హాలు తీసుకుంటున్నాడు జ‌క్క‌న్న‌. దానికితోడు షూటింగ్ మొద‌లుపెట్టే ముందే.. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పై టెస్ట్ క‌ట్ కూడా చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి. మొత్తానికి వ‌చ్చే సెప్టెంబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక చూడాలి.. రాజ‌మౌళి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ తో ఎన్ని రికార్డులు బ‌ద్ధ‌లు కొడ‌తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here