రామ్ చ‌ర‌ణ్ ర‌ప్ఫాడిస్తున్నాడుగా..


బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన కిక్ ఫుల్ బాటిల్ తాగిన‌ట్లుంటుందేమో..? ఆ కిక్ లోంచి అంత ఈజీగా బ‌య‌టికి రాలేరు. కానీ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చేసాడు. రంగ‌స్థ‌లం అంత పెద్ద విజ‌యం సాధించినా కూడా మ‌ళ్లీ వెంట‌నే తేరుకుని ఇంకో సినిమాతో బిజీ అయిపోయాడు. బోయ‌పాటితో ఈయ‌న సినిమా మొద‌లైంది.
రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా న‌డుస్తుంది. రంగ‌స్థ‌లంలో ప‌క్కా ఊరు కుర్రాడిలా అలరించిన చ‌ర‌ణ్.. ఇప్పుడు మాత్రం పూర్తిగా మాస్ కారెక్ట‌ర్ లోకి స్టైలిష్ అవ‌తారంలోకి మారిపోతున్నాడు. బోయ‌పాటికి ఈ చిత్రంతో ఓ ల‌క్ష్యాన్ని కూడా ఇచ్చాడు చ‌ర‌ణ్. దీన్ని కేవ‌లం ఆర్నెళ్ల‌లో పూర్తిచేయాలి. ఏడాదికి ఓ సినిమా చేయ‌డమే రాదు బోయ‌పాటికి..
అలాంటిది ఆర్నెళ్ల‌కు ఎలా చేస్తాడో మ‌రి..? మ‌రో ఆప్ష‌న్ లేద‌క్క‌డ‌. ఇప్పుడు నిజంగా ఇది పూర్తి చేస్తాడా అనేది మాత్రం క‌చ్చితంగా ఆస‌క్తిక‌రంగా మారింది.
ఈ మ‌ధ్యే రెండో షెడ్యూల్ మొద‌లైంది. డివివి దానయ్య దీనికి నిర్మాత‌. ఇందులో కైరాఅద్వానీ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇదిలా ఉంటే 2018, జూన్ 10న బాల‌య్య‌-బోయ‌పాటి సినిమా ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ రోజు బాల‌య్య పుట్టిన‌రోజు. షూటింగ్ ఎప్పుడో క్లారిటీ లేదు. అక్టోబ‌ర్ నుంచి చ‌ర‌ణ్.. రాజ‌మౌళి సినిమా చేయ‌నున్నాడు. మ‌రోవైపు బాల‌య్య‌తో బోయ‌పాటి చేయ‌బోయే సినిమా 2019 మార్చ్ లోపు పూర్త‌వ్వాలి.
ఎందుకంటే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఈ చిత్రం కీల‌కం కాబ‌ట్టి.. ఎన్నిక‌ల ముందే విడుద‌ల‌వ్వాలి కాబ‌ట్టి. ఈ గ్యాప్ లో బాల‌య్య‌-వినాయ‌క్ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఎటు చూసుకున్నా.. ఈ రెండు సినిమాల‌కు మ‌ధ్య గ్యాప్ ఆర్నెళ్లే. మ‌రి బోయ‌పాటి ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here