రామ్ తో ప్రేమ‌లో ప‌డిన ప్ర‌వీణ్..


ఇండ‌స్ట్రీలో గుర్తు పెట్టుకోడానికైనా.. మ‌రిచిపోవ‌డానికైనా ఒక్క సినిమా చాలు. డిజాస్ట‌ర్ ఇస్తే ఎవ‌రు అంటారు.. బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తే రారా అంటారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ విష‌యంలో రెండోది జ‌రుగుతుంది. ఈయ‌న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌లేదు కానీ త‌న టేకింగ్ తో పిచ్చెక్కించాడు. అందుకే ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తా గురించి ఇండ‌స్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది.
గ‌తేడాది వ‌ర‌కు కూడా ఈ పేరును ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే ఈయ‌న కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవు కాబ‌ట్టి. గుంటూర్ టాకీస్ విజ‌యం సాధించినా కూడా అది అడ‌ల్ట్ సినిమా. అందులో హీరోయిన్ల అందాలు.. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తోనే సినిమా హిట్టైంది. దాంతో ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా ఎవ‌రికీ తెలియ‌లేదు. కానీ గ‌తేడాది గ‌రుడ‌వేగ‌తో త‌న స‌త్తా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్. కానీ ఈయ‌న టేకింగ్ కు మాత్రం అంతా ఫిదా అయిపోయారు.
ప్రేక్ష‌కులు దాదాపు మ‌రిచిపోయిన రాజ‌శేఖ‌ర్ ను హీరోగా తీసుకోవ‌డ‌మే పెద్ద షాక్ అనుకుంటే.. ఆయ‌న్ని పెట్టి థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించాడు ప్ర‌వీణ్. గ‌త కొన్నేళ్లుగా రాజ‌శేఖ‌ర్ సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ గ‌రుడవేగ 6.3 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇది ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ఉన్న ఇమేజ్ కు చాలా ఎక్కువ‌.
ఈ సినిమా త‌ర్వాత ఇప్పుడు రామ్ తో ప్ర‌వీణ్ స‌త్తార్ సినిమా మొద‌లైంది. ఈయ‌న‌కు ప్ర‌వీణ్ చెప్పిన క‌థ బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే సినిమా మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం అడ్వంచ‌ర‌స్ డ్రామా.. దానికితోడు మైన‌స్ 20 డిగ్రీస్ లో రామ్-ప్ర‌వీణ్ సినిమా మేకింగ్ జ‌ర‌గ‌నుంది. ఇది కూడా ఓ సాహ‌స‌మే. ఇప్పుడు రామ్ చేస్తోన్న త్రినాథ‌రావ్ న‌క్కిన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే పూర్తి కాగానే మే నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి చూడాలిక‌.. ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా రామ్ తో ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here