రామ్ ప్రేమ‌క‌థ మొద‌లైందోచ్..!

Ram Praveen Sattaru
హ‌మ్మ‌య్యా.. ఆర్నెళ్ళ త‌ర్వాత రామ్ మ‌ళ్లీ మొహానికి రంగేసుకున్నాడు. కెమెరా ముందుకొచ్చాడు. ఈయ‌న న‌టిస్తోన్న హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమా షూటింగ్ మొద‌లైంది. త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం గ‌తేడాదే ముహూర్తం జ‌రుపుకుంది. ఇన్నాళ్ల‌కు సెట్స్ పైకి వ‌చ్చింది. సినిమా సినిమాకు రామ్ తీసుకునే గ్యాప్ ఈ చిత్రానికి అడ్డంకిగా మారింది. ఇన్నాళ్ల‌కు సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కావ‌డంతో బిజీ అయిపోయాడు రామ్. ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీగా రూపొందుతుంది. నేనులోక‌ల్.. సినిమా చూపిస్తా మావా త‌ర‌హాలోనే మ‌రోసారి మామా అల్లుళ్ల కాన్సెప్ట్ నే ఇందులోనూ వాడుకుంటున్నారు త్రినాథ‌రావ్ న‌క్కిన అండ్ ప్ర‌స‌న్న కుమార్ బ్యాచ్. హైప‌ర్.. ఉన్న‌ది ఒకటే జిందగీ ఫ్లాప్ తో నిరాశ‌ప‌డిన రామ్ కు ఈ సినిమా కీల‌కంగా మారింది. పైగా దిల్ రాజు నిర్మాత కావ‌డంతో ఏదో ఒక‌టి చేసి హిట్ ఇస్తారనే న‌మ్మ‌కం రామ్ లో క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ హీరో ఆశ‌ల‌ను హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here