రారండోయ్.. రాజ‌మౌళి క‌థ చెప్తాడంట‌..!


రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అడ‌గడం పిచ్చి విష‌య‌మే. ఎంత వ‌చ్చింది.. ఎంత తెస్తుంది.. ఇంకెన్ని రికార్డులు వ‌స్తాయ‌ని అడ‌గాలి. అలా మారిపోయింది ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడి బ్రాండ్. ఈయ‌న సినిమా అంటే క‌లెక్ష‌న్లు అలా వ‌చ్చేస్తాయంతే. ఇప్పుడు రాజ‌మౌళి ఆఫ‌ర్ ఇస్తానంటే క‌థ కూడా అడ‌గ‌రు హీరోలు. ఇదేదో మాట వ‌ర‌స‌కు అనే మాట కాదు. ఎందుకంటే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో ఈయ‌న సినిమా ప్లాన్ చేస్తున్నాడు క‌దా..
దానికి ఇంకా క‌థ కూడా చెప్ప‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. అటు చ‌ర‌ణ్ కానీ.. ఇటు ఎన్టీఆర్ కానీ ద‌ర్శ‌క‌ధీరున్ని క‌థ ఏంట‌ని అడిగే ధైర్యం కూడా చేయ‌లేదు. ఎందుకంటే ఆయ‌న‌పై అంత న‌మ్మ‌కం మ‌రి. అయితే ఎంత వ‌ద్ద‌న్నా వాళ్లు కూడా స్టార్ హీరోలే. ఇప్ప‌టి వ‌ర‌కు క‌థేంటో చెప్ప‌క‌పోయినా లైన్ మాత్రం చెప్పాడు రాజ‌మౌళి. ఇక ఇప్పుడు ఇద్ద‌రు హీరోల‌ను పిలిచి పూర్తిక‌థ చెప్ప‌బోతున్నాడు జ‌క్క‌న్న‌. దానికోసం చ‌ర‌ణ్..
ఎన్టీఆర్ ల‌కు ఫ్రీ టైమ్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బోయ‌పాటి సినిమాతో చ‌ర‌ణ్.. త్రివిక్ర‌మ్ సినిమాతో ఎన్టీఆర్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు అక్టోబ‌ర్ లోపు పూర్తి కానున్నాయి. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ రాజ‌మౌళి సినిమాలో జాయిన్ కానున్నారు. మ‌రి చూడాలి.. ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను పెట్టి రాజ‌మౌళి ఎలాంటి క‌థ చేయ‌బోతున్నాడో..? అన్న‌ట్లు ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య దాదాపు 250 కోట్ల‌తో తెర‌కెక్కించ‌బోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here