ర‌జినీకాంత్ కు తొలి హిట్ కావాలంట‌..!

   
అదేంటి.. 40 ఏళ్లుగా ఎన్నో విజ‌యాలు.. మ‌రెన్నో రికార్డులు అవార్డులు అందుకున్న ర‌జినీకాంత్ ఇప్పుడు తొలి హిట్ కావాల‌నుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ఆయ‌న ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. కానీ ఆయ‌న ఎక్క‌ని ఓ శిఖ‌రం అలాగే ఉండిపోయింది. రజినీకాంత్ లో న‌టుడితో పాటు ర‌చ‌యిత కూడా ఉన్నాడు. అప్పుడ‌ప్పుడూ ఆయ‌న బ‌య‌టికి వ‌స్తుంటాడు. ఇప్పుడు కూడా మ‌రోసారి బ‌య‌టికి వ‌స్తున్నాడు. ఈ హీరో గ‌తంలోనే మూడు సినిమాల‌కు క‌థ‌లు రాసాడు. రాజ‌కీయాల్లోనూ బిజీ అవ్వాల‌ని చూస్తోన్న ఈ స‌మ‌యంలో ఆయ‌న ఓ క‌థ రాయ‌డానికి శ్రీ‌కారం చుడుతున్నాడు. ఈయ‌న త్వ‌ర‌లోనే స‌ముద్ర‌ఖ‌ని కోసం ఓ క‌థ రాయ‌బోతున్నారు. ర‌ఘువ‌ర‌న్ బిటెక్ లో ధ‌నుష్ తండ్రిగా న‌టించాడు స‌ముద్ర‌ఖ‌ని. ర‌జినీ త‌న కోసం క‌థ సిద్ధం చేస్తున్న‌ట్లుగా స‌ముద్ర‌ఖ‌ని స్వ‌యంగా తెలిపాడు. ఈయ‌న ప్ర‌స్తుతం కాలాలో ర‌జినీకాంత్ తో క‌లిసి న‌టిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే తాను క‌థ రాయ‌బోతున్నట్లు ర‌జినీ త‌న‌కు చెప్పాడ‌ని స‌ముద్ర‌ఖ‌ని రివీల్ చేసాడు. గ‌తంలో 1993లో వ‌ల్లి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు క‌థ రాసాడు ర‌జినీ.. ఇక 2002లో బాబాకు క‌థ అందించాడు ఈ రెండూ ఫ్లాపే. ఇక మోహ‌న్ బాబు 500వ సినిమా రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రికి ర‌జినీ కాంత్ టీం క‌థ అందించారు. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి క‌థ రాస్తున్నాడు ర‌జినీ. మ‌రి ఇప్పుడైనా విజ‌యం అందుకుంటాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here