ర‌జినీకాంత్ దారిలో అనుష్క‌..


హిమాల‌యాలు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చే పేరు ర‌జినీకాంత్. ఆయ‌న త‌ప్ప ఇంకెవ‌రూ వెళ్ల‌ర‌ని కాదు కానీ ఆయ‌న వెళ్తుంటే అదో ర‌కం ఆనందం అభిమానుల్లో. ఏడాదంతా సినిమాల‌తో బిజీగా ఉండే ఈయ‌న‌.. ఒక్క నెల రోజులు మాత్రం హాయిగా హిమాల‌యాల‌కు వెళ్లి సేద తీరి వ‌స్తుంటారు. ఇప్పుడు అనుష్క కూడా ఇదే చేసింది. కాక‌పోతే హిమాల‌యాల‌కు కాదు.. అక్క‌డే ఉన్న కేదార్ నాథ్ యాత్ర‌కు వెళ్లింది ఈ జేజ‌మ్మ‌.
ఈ మ‌ధ్య కాలంలో సినిమాలేవీ చేయ‌ని అనుష్క‌కు ఫ్రీ టైమ్ చాలా కుదిరింది. దాంతో ఎప్ప‌ట్నుంచో ప్లాన్ లో ఉన్న ఈ యాత్ర‌ను ఇప్పుడు పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ‌. కేదార్ నాథ్ కు వెళ్ల‌డ‌మే కాదు.. అక్క‌డ సాధార‌ణ వ్య‌క్తిలా తిరిగేసింది ఈ భాగ‌మ‌తి. అస‌లు త‌ను ఓ సెలెబ్రెటీ అనే విష‌య‌మే మ‌రిచిపోయి అక్క‌డి భ‌క్తుల‌తో పాటు దేవుడి ద‌ర్శ‌నానికి వెళ్లింది. భాగ‌మ‌తి త‌ర్వాత గౌత‌మ్ మీన‌న్ సినిమాకు క‌మిటైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు అది షూటింగ్ మొద‌లు కాలేదు. ఇప్ప‌ట్లో ఉండేలా కూడా కనిపించ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. అనుష్క త‌ర్వాతి సినిమా ఎప్పుడు ఉంటుందో..? ఆ లోపు ఇంకెన్ని దైవ ద‌ర్శ‌నాలు చేసుకుంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here