ర‌జినీ ప్లేస్ కొట్టేసిన నాగ‌శౌర్య‌..


ఎక్క‌డి నాగ‌శౌర్య‌.. ఎక్క‌డి ర‌జినీకాంత్.. ఆయ‌న స్థానాన్ని నాగ‌శౌర్య తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. అస‌లు విష‌యం ఏంటంటే ఎప్రిల్ 27న ర‌జినీకాంత్ కాలా సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం అనుకోని కార‌ణాల‌తో జూన్ 7కి వెళ్లిపోయింది.
దాంతో ఆ డేట్ ఖాళీగా మారిపోయింది. ఆచారి అమెరికా యాత్ర అదే రోజు వ‌స్తుంద‌ని చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఏమీ చెప్ప‌ట్లేదు. దాంతో ఆ తేదీ ఖాళీగా మిగిలిపోతుందేమో.. భ‌ర‌త్ పండ‌గ చేసుకుంటాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు నేనున్నానంటూ వ‌స్తున్నాడు నాగ‌శౌర్య‌. ఈయ‌న న‌టించిన క‌ణం సినిమా చాలా రోజులుగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. బై లింగువ‌ల్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌కుడు.
ఎప్రిల్ 27న రెండు భాష‌ల్లో ఒకేసారి క‌ణం విడుద‌ల కానుంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డంతో ఈ సినిమాపై ఆస‌క్తి బాగానే క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ర‌జినీ వ‌దిలిన స్థానాన్ని క‌ణం ఎంత‌వ‌ర‌కు యూజ్ చేసుకుంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here