ర‌వితేజ కోసం ఇలియానా.. నిజ‌మేనా..?


ఇలియ‌నా.. ఈ పేరు తెలుగు ఇండ‌స్ట్రీలో విని ఆరేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో 2012లో ర‌వితేజ‌తోనే దేవుడు చేసిన మ‌నుషులు సినిమా చేసిన త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ వైపు చూడ‌ట‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పూర్తిగా బాలీవుడ్ కు ప‌రిమితం అయిపోయింది. అక్క‌డ నాలుగైదు సినిమాలు చేసినా కూడా పెద్ద‌గా గుర్తింపు అయితే రాలేదు. విజ‌యాలు ఉన్నా ఎందుకో కానీ ఇలియానా వైపు చూసింది లేదు.
ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్న ఇల్లీబేబికి ఇప్పుడు తెలుగు నుంచి పిలుపు వ‌చ్చింద‌ని తెలుస్తుంది. అది కూడా ర‌వితేజ త‌ర‌ఫు నుంచే..! అవును.. ఈయ‌న ప్ర‌స్తుతం శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా అను ఎమ్మాన్యువ‌ల్ ను తీసుకున్నారు. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు కూడా ఇందులో అవ‌కాశం ఉంది. ఈ ఆఫ‌ర్ ఇలియానాకు వెళ్లింద‌ని తెలుస్తుంది. దానికి కార‌ణం కూడా ర‌వితేజ అని తెలుస్తుంది.
ఈయ‌నే ఇలియానా అయితే బాగుంటుంద‌ని రిఫ‌ర్ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ర‌వితేజ‌తో క‌లిసి కిక్.. ఖ‌త‌ర్నాక్.. దేవుడు చేసిన మ‌నుషులు సినిమాల్లో న‌టించింది ఇలియానా. ఇక ఇదే సినిమాలో శృతిహాస‌న్ కూడా న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. బ‌లుపులో ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రూ జోడీ క‌ట్టారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ర‌వితేజతో వీళ్ల రొమాన్స్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here