ర‌వితేజ ట‌చ్ చేస్తూనే ఉన్నాడుగా..!

Stay tuned for the first look of ‘Touch Chesi Chudu’
ఒక్క‌సారి వ‌చ్చిన అభిమానం అంత ఈజీగా పోద‌ని ర‌వితేజ‌కు ఈ మ‌ధ్యే అర్థ‌మైంది. తాను రెండేళ్లు  గ్యాపిచ్చినా ప్రేక్ష‌కులు మాత్రం త‌నపై అదే ప్రేమ చూపించారు. ఈయ‌న న‌టించిన రాజా ది గ్రేట్ 30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ట‌చ్ చేసి చూడు షూటింగ్ లో పాల్గొం టున్నాడు. ఆ మ‌ధ్య ఈ క‌థ‌లో ఇంకొన్ని మార్పులు చేయాల్సిందిగా ద‌ర్శ‌కున్ని మాస్ రాజా కోరిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. రాజా ది గ్రేట్ లో ఫుల్ ఎంట‌ర్ టైన్మెంట్ ఉంది. దాంతో ట‌చ్ చేసి చూడులో కూడా కాస్త కామెడీ డోస్ పెంచాలంటూ ద‌ర్శ‌కున్ని కోరాడు ర‌వితేజ‌. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు మాస్ రాజా. విక్ర‌మ్ సిరి అనే కొత్త ద‌ర్శ‌కుడు దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పోలీస్ స్టోరీ అంటే క‌చ్చితంగా యాక్ష‌న్ పార్ట్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే కాస్త కామెడీ ట‌చ్ ఇస్తున్నాడు ర‌వితేజ‌.
ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే ఈ స్టిల్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ప్రీ లుక్ విడుద‌లైంది. ప్రీ లుక్ చూస్తుంటే నిజంగానే ఎవ‌డైనా ట‌చ్ చేస్తే వాడికి ప‌గిలిపోవ‌డం గ్యారెంటీ అనేలా ఉంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ర‌వితేజ‌, ముర‌ళీశ‌ర్మ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు మాస్ రాజా. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. డిసెంబ‌ర్ లో షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి కానుక‌గా ట‌చ్ చేసి చూడును విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అన్నీ కుదిర్తే జ‌న‌వ‌రి 12న ట‌చ్ చేసి చూడు విడుద‌ల కానుంది. ఇందులో ర‌వితేజ గెట‌ప్ మ‌రోలా ఉంటుంది కాబ‌ట్టి.. రాజా గెట‌ప్ తో క్లాష్ కాకూడ‌ద‌నే ఆ మ‌ధ్య కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చార‌ని చెబు తున్నారు చిత్ర‌యూనిట్. మ‌రో వైపు ట‌చ్ చేసి చూడుకు క‌థ రాసిన వ‌క్కంతం వంశీ.. ద‌ర్శ‌కుడిగా మారిన నా పేరు సూర్య‌తో బిజీగా ఉన్నాడు. మ‌రి చూడాలిక‌.. ర‌వితేజ ట‌చ్చింగులు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here