లావ‌ణ్యపై ఎందుకో అంత మెగాప్రేమ‌..!

ఇండ‌స్ట్రీలో అంతే.. ఒక్క‌సారి మెగా హీరోల క‌న్ను ప‌డితే అంత ఈజీగా వ‌ద‌ల‌రు. చాలా మంది హీరోయిన్ల‌కు వాళ్లు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు లావ‌ణ్య త్రిపాఠికి కూడా ఇదే టైమ్ న‌డుస్తుంది. ఈమెకు విజ‌యాలు రావ‌ట్లేదు కానీ అవ‌కాశాలు మాత్రం కాదు. ఇప్ప‌టికీ మెగా హీరోలే ఆదుకుంటున్నారు. అప్పుడెప్పుడో శిరీష్ శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు అంటూ దీవించాడు.
ఆ త‌ర్వాత మిస్ అంటూ వ‌రుణ్ తేజ్ మిస్ట‌ర్ తో ప‌ల‌క‌రించాడు. మొన్న‌టికి మొన్న కెరీర్ అంతా డ‌ల్ అయిపోయిన టైమ్ ఇంటిలిజెంట్ ఆఫ‌ర్ ఇచ్చాడు సాయిధ‌రంతేజ్. కానీ శ్రీ‌ర‌స్తు త‌ప్పిస్తే మిగిలిన రెండు సినిమాలు డిజాస్ట‌ర్లే. ఈ టైమ్ లో ఇప్పుడు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు వ‌రుణ్ తేజ్. ఈ మ‌ధ్య లావ‌ణ్య కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా ఆమె న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాపులే. దాంతో సాధార‌ణంగానే లావ‌ణ్య‌కు ముద్దు పేరు వ‌చ్చేసింది. అదే ఐరెన్ లెగ్ అని. అస‌లు ఈ ఇండ‌స్ట్రీ అంటేనే వైకుంఠపాళి.
ఆట తెలిసి పాము అనే ఫ్లాప్ నోట్లో ప‌డ‌కుండా హిట్ అనే నిచ్చెన ఎక్కుతూ వెళ్లిపోవాలి. ఒక్క‌సారి పాము నోట్లో ప‌డితే కింద‌కి జారిపోవాల్సిందే. ఈ ఆట తెలియ‌కే చాలా ఏళ్లుగా ఇబ్బంది ప‌డు తుంది లావ‌ణ్య త్రిపాఠి. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు ఎక్కుతుంది కానీ ఎక్కిన నిచ్చెన‌ల కంటే పాము నోట్లోనే ఎక్కువ‌గా ప‌డుతుంటుంది ఈ భామ‌.
ఇప్పుడు మ‌రీ దారుణంగా ఆట మొద‌ట్లోనే ఉంది లావ‌ణ్య త్రిపాఠి. పాములు ఎన్నో సార్లు కాటేసిన త‌ర్వాత ఇప్పుడు చివ‌ర‌గా ఒక్క నిచ్చెన ఎక్కాల‌ని చూస్తుంది. ఆ నిచ్చెన పేరు వ‌రుణ్ తేజ్-సంక‌ల్ప్ రెడ్డి సినిమా. సై ఫై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఇదే సినిమాలో అదితిరావ్ హైద్రీ కూడా ఉంది. మొత్తానికి చూడాలిక‌.. కెరీర్ అంతా గంగ‌లో క‌లిసిపోయే టైమ్ లో మ‌రోసారి వ‌రుణ్ తేజ్ ఆఫ‌ర్ ఇచ్చాడు. మ‌రి ఎలా ఉండ‌బోతుందో ఈ అందాల రాక్ష‌సి కెరీర్..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here