వర్మ సినిమాలో కథానాయికగా మైరా సరీన్

నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. “కంపెనీ” పతాకంపై రాంగోపాల్ వర్మ-సుధీర్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని.. జనవరి నుంచి మొదలవ్వబోయే సెకండ్ షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది.
ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా వేర్వేరు వార్తలొస్తున్నా విషయం తెలిసిందే. ఈ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసేందుకు వర్మ స్వయంగా రంగంలోకి దిగి.. నాగార్జున హీరోగా తాను తెరకెక్కిస్తున్న నాలుగో సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు. తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా ఈ చిత్రంలో కథానాయికగా పరిచయమవుతున్న మైరా సరీన్ ను పరిచయం చేశారు దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here