వాళ్ల‌కు మ‌ళ్లీ మంచి రోజులు..


తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థ‌లున్నాయి. అందులో త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌పేజీ రాసుకున్న సంస్థ వై జ‌యంతి మూవీస్. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వ‌ర‌కు అంద‌రితోనూ సినిమాలు తీసాడు నిర్మాత అశ్వినీద‌త్. కానీ కొన్నేళ్లుగా ఆయ‌న పూర్తిగా క‌న‌బ‌డ్డ‌మే మానేసాడు. అప్పుడెప్పుడో శ‌క్తి త‌ర్వాత సినిమాలు నిర్మించ‌లేదు.
కానీ ఇన్నేళ్ల త‌ర్వాత ఆయ‌న పేరు ప‌డ‌క‌పోయినా.. ఆయ‌న కూతుళ్ళు గొప్ప ప్ర‌య‌త్నం చేసారు. అదే మ‌హాన‌టి. ఈ చిత్రంతో డ‌బ్బులు త‌ర్వాత‌.. ముందు గౌర‌వం పెరిగిపోయింది ఆ సంస్థ‌కు. మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చేసాయి. పైగా ఇప్పుడు అశ్వినీదత్ కూడా వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న నాని, నాగార్జున హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్.. మ‌హేశ్ హీరోగా మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.
ఇక 28 ఏళ్ల కింద మే 9న భారీ వ‌ర్షాల్లో విడుద‌లైన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి ఇండ‌స్ట్రీ హిట్ అయింది.. ఇదే రోజు మ‌ళ్లీ ఇప్పుడు మ‌హాన‌టి విడుద‌లైంది. ఇప్పుడు ఎండ‌లు మండిపోతున్నాయి. అయినా ప్రేక్ష‌కులు మాత్రం బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ఏదేమైనా వై జ‌యంతికి మ‌ళ్లీ పున‌ర్వైభవం వ‌చ్చింది. అంటే మ‌ళ్లీ మంచి సినిమాలు వ‌చ్చేస్తాయి అన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here