వాళ్ల‌ను మ‌నుషులు కాదంటోన్న చ‌ర‌ణ్..

Ram Charan
అదేంటి.. అంత మాట రామ్ చ‌ర‌ణ్ ఎవ‌ర్ని అన్నాడు..? అనాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అన్నాడు.. నిజంగానే రామ్ చ‌ర‌ణ్ ఇదే మాట అన్నాడు. ఇంత‌కీ ఇంత మాట చ‌ర‌ణ్ ఎవ‌ర్ని అనాల్సి వ‌చ్చిందో తెలుసా..? ర‌ంగ‌స్థ‌లం సినిమా విష‌యంలో ఈ మాట వాడాడు చ‌ర‌ణ్. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో భాగంగానే అన్ని ఛానెల్స్ కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు మెగా వార‌సుడు. ఈ ప్ర‌మోష‌న్ లో రంగ‌స్థ‌లం గురించి యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఇది త‌న‌కు చాలా ప్ర‌త్యేక‌మైన సినిమా అని చెప్పాడు చ‌ర‌ణ్. బ‌హుశా ఇలాంటి చిత్రం మ‌ళ్లీ జీవితంలో చేస్తానో లేదో అని చెప్పాడు మెగా వార‌సుడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సినిమా చూసిన త‌ర్వాత ఎమోష‌న్ కు ఏడ‌వ‌క‌పోతే వాడు అస‌లు మ‌నిషే కాదంటూ కాస్త ఎమోష‌న‌ల్ అయ్యాడు చ‌ర‌ణ్. ఎంత కాన్ఫిడెన్స్ లేక‌పోతే చ‌ర‌ణ్ ఇంత మాట ఇంట‌ర్వ్యూలో అంటాడు చెప్పండి. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం నిజంగానే నిజ‌మ‌వుతుందో.. లేదంటే సుకుమార్ పై ఈయ‌నే అతి న‌మ్మ‌కం ఉందో అర్థ‌మైపోతుంది త్వ‌ర‌లోనే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here