విక్ర‌మ్ మ‌ళ్లీ ప‌డ్డాడు కానీ.. లేస్తున్నాడుగా..!

Sketch
మాస్ ఇమేజ్ కావాలని ప్ర‌తీ హీరో క‌ల‌లు కంటాడు. అది రావ‌డం అంత ఈజీ కాదు.. కానీ వ‌స్తే ఉండే లాభాలు మాత్రం మామూలుగా ఉండ‌వు. ఒక్క‌సారి క‌మ‌ర్షియ‌ల్ స్టార్ గా నిల‌బ‌డ్డాడంటే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా ఆ హీరోకు అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయి. ఒక్క హిట్ ప‌డితే పోయిన ఫ్లాపుల‌న్నీ క‌వ‌ర్ అయిపోతాయి. విక్ర‌మ్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ లోనే ఉన్నాడు. ఈ హీరోకు ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కలిసి రావ‌ట్లేదు.. పేరు తెచ్చిన ప్ర‌యోగాలు బెడిసికొట్టాయి.. మాస్ సినిమాలు హ్యాండిచ్చాయి. ఇలాంటి టైమ్ లో ఎలాంటి సినిమా చేయాలో తెలియ‌క తెగ హైరానా ప‌డిపోయాడు విక్ర‌మ్. చివ‌రికి ఎలాగోలా ధైర్యం చేసి.. త‌న‌కు అచ్చొచ్చిన దారిలోనే వెళ్తున్నాడు ఈ హీరో. మ‌రోసారి ప్ర‌యోగాల బాట‌లోనే న‌డుస్తున్నాడు. శంక‌ర్ తో చేసిన ప్ర‌యోగం ఐ బెడిసి కొట్టినా.. ఇరుముగ‌న్ తో ప‌ర్లేద‌నిపించాడు. ఇక ఇప్పుడు స్కెచ్ సినిమాతో వ‌చ్చాడు. మొన్న పండ‌క్కి వ‌చ్చిన ఈ చిత్రం కూడా పెద్ద‌గా ఆడ‌ట్లేదు.
ఇన్ని ఫ్లాపులు వ‌స్తున్నా.. విక్ర‌మ్ కెరీర్ పై మాత్రం అవి పెద్ద‌గా ప్ర‌భావం చూపిస్తున్న‌ట్లు క‌నిపించ‌ట్లేదు. స్కెచ్ కూడా తేడా కొట్టినా.. ఇప్ప‌టికీ విక్ర‌మ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ప్ర‌స్తుతం గౌత‌మ్ మీన‌న్ ధృవ‌న‌క్ష‌త్రం సినిమాలో న‌టిస్తున్నాడు విక్ర‌మ్. ఇది విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇక సామి సీక్వెల్ గా సామి స్క్వేర్ చేస్తున్నాడు 14 ఏళ్ల కింద హ‌రి చేసిన ఈ చిత్రం అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్. తెలుగులో దీన్నే ల‌క్ష్మీన‌ర‌సింహాగా రీమేక్ చేసాడు బాల‌య్య‌. ఈ చిత్రంతో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు విక్ర‌మ్. ఈ మ‌ధ్యే మ‌హావీర్ క‌ర్ణ అనే సినిమా క‌మిట‌య్యాడు విక్ర‌మ్. 300 కోట్ల‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. మ‌ళ‌యాల ద‌ర్శ‌కుడు ఆర్ఎస్ విమ‌ల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. మొత్తానికి వ‌ర‌స‌గా ఫ్లాపులు వ‌స్తున్నా కూడా విక్ర‌మ్ కెరీర్ మాత్రం ఇప్ప‌టికీ ప‌రుగులు పెడుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here