విజ‌య్ కు బాగా మైత్రి కుదిరిందిగా.. 

Tentative title for Vijay Deverakonda’s next
ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీకి హాట్ కేక్ అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న్ని విజ‌య్ అని పిల‌వ‌డ‌మే మానేసారు ఇప్పుడు. అంతా అర్జున్ రెడ్డి అనే పిలుస్తున్నారు. చివ‌రికి పోలీసులు కూడా మ‌నోడి ఫోటోను ట్రాఫిక్ రూల్స్ కోసం వాడేస్తున్నారంటే కుర్రాడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకో వ‌చ్చు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ డేట్స్ బాగా కాస్ట్ లీ అయిపోయాయి. అయినా కానీ విజ‌య్ తో సినిమా కోసం క్యూ క‌డుతున్నారు పెద్ద నిర్మాత‌లు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇమేజ్ లేదు.. పైగా ఇలాంటి పాత్ర‌లోనే స‌రిపోతాడు అనే లిమిటేష‌న్స్ లేవు. ఏ పాత్ర‌లోనైనా ఇట్టే దూరిపోతాడు. పెళ్లిచూపులు నుంచి అర్జున్ రెడ్డి వ‌ర‌కు క్లాస్ మాస్ తేడా లేకుండా కుమ్మేస్తాడు. పెళ్లిచూపులు సినిమా టైమ్ లో దాన్ని విడుద‌ల చేయ‌డానికే నానా తంటాలు ప‌డ్డాడు. కానీ ఇప్పుడు ఈయ‌న సినిమా చేస్తుంటే మేం విడుద‌ల చేస్తాం అంటే లేదు మేం చేస్తామంటూ వెంట ప‌డుతున్నారు నిర్మాత‌లు.
చాలా సైలెంట్ గా వ‌చ్చిన ఈ కుర్రాడు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయాడు. పెళ్లిచూపులు సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డితో అరాచ‌కాలే చేసాడు. ఈ చిత్రం 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దాంతో చిన్న నిర్మాత‌ల‌కి విజ‌య్ వ‌రంగా మారాడు. నాని ఈ రేంజ్ నుంచి స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు విజ‌య్ ఇదే దారిలో న‌డుస్తున్నాడు. విజయ్ డేట్స్ కోసం ఇండ‌స్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాత‌లు క్యూక‌డుతున్నారు. ఇప్ప‌టికే గీతాఆర్ట్స్ లో వ‌ర‌స‌గా రెండు సినిమాలు చేస్తున్నాడు విజ‌య్. అల్లుఅర‌వింద్ నిర్మాణంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తోన్న‌ సినిమా షూటింగ్ దాదాపు స‌గానికి పైగా పూర్తైంది.
దాంతోపాటు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమాకు సై అన్నాడు విజ‌య్.ఈ చిత్రానికి అక్ష‌రాలా 4 కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడనే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజ‌మైతే మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ మామూలుగా పెరిగిన‌ట్లు కాదు. ఒక‌ప్పుడు ల‌క్ష‌ల్లోనే ఉన్న విజ‌య్.. ఇంత త్వ‌ర‌గా కోట్ల‌కు వ‌స్తాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అదృష్టం అంటే ఇదే మ‌రి. కొత్త ద‌ర్శ‌కుడితో మైత్రి మూవీ మేక‌ర్స్ లో విజ‌య్ సినిమా చేస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక త్రివిక్ర‌మ్ నిర్మాణంలో నందినిరెడ్డితో ఓ సినిమా ఒప్పుకున్నాడు విజ‌య్. దానికి తోడు కొత్త ద‌ర్శ‌కులు భ‌ర‌త్ క‌మ్మ‌.. రాహుల్ సంక్రీత్య‌న్ ల‌తోనూ సినిమాలు చేయ‌బోతున్నాడు. ఆ మ‌ధ్య ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ బైలింగువ‌ల్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు విజ‌య్. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిట్ అయ్యాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు బాబీతో ఓ సినిమా చేయ‌బోతున్నాడని తెలుస్తుంది. ఇవ‌న్నీ గానీ హిట్టైతే విజ‌య్ దేవ‌ర‌కొండను ప‌ట్టుకోవ‌డం క‌ష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here