విజ‌య్ వాళ్ల‌కే నో చెప్పేసాడా..? 

Vijay Deverakonda
ఇండ‌స్ట్రీలో హిట్ తోనే ప‌ని. ఇంకేం అక్క‌ర్లేదిక్క‌డ‌. ఒక్క సినిమా హిట్టైతే ఇండ‌స్ట్రీ మొత్తం నీ వెంటే ఉంటుంది. ఇక రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు వ‌స్తే నువ్వే దేవుడు.. నిన్ను మించినోడు లేడు అంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. సామాన్యుడి నుంచి అసాధ్యుడిగా మారిపోయాడు విజ‌య్. పెళ్లిచూపులు క‌లిసొచ్చిన సినిమా అనుకుంటే.. అర్జున్ రెడ్డితో అరాచ‌కం చేసాడు ఈ కుర్ర హీరో. ఈ చిత్రంతో మ‌నోడి రేంజ్ బాలీవుడ్ వ‌ర‌కు పాకిపోయింది. దెబ్బ‌కు అక్క‌డ్నుంచి నిర్మాణ సంస్థ‌లు దిగొచ్చి ఈయ‌న‌కి ఆఫ‌ర్స్ ఇస్తున్నాయి. పైగా మ‌ణిర‌త్నం లాంటి లెజెండ‌రీ ద‌ర్శ‌కులు కూడా విజ‌య్ ప‌ర్ఫార్మెన్స్ పై ఓ క‌న్నేస్తున్నారు. ప్రస్తుతం ఈ కుర్రాడి చేతిలో ఆరు సినిమాలున్నాయి.
ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు హిందీ నుంచి య‌శ్ రాజ్ సంస్థ విజ‌య్ ను త‌మ సంస్థ‌లో న‌టించ‌మ‌ని కోరింద‌ని తెలుస్తుంది. అయితే దీనికి విజ‌య్ సున్నితంగా నో చెప్పాడు. దానికి పెద్దగా కార‌ణాలు ఏమీ లేవు. య‌శ్ రాజ్ లో ఒక్క‌సారి న‌టిస్తే వ‌ర‌స‌గా మూడు సినిమాల డీల్ ఉంటుంది. అలా చేయ‌కుండా బ‌య‌ట‌ప‌డిన హీరో నాని మాత్ర‌మే. ఆహాక‌ళ్యాణం త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చేసాడు న్యాచుర‌ల్ స్టార్. కానీ విజ‌య్ ను మూడు సినిమాల డీల్ అడిగారు. అలా చేస్తే తాను ఇత‌ర అవ‌కాశాల‌కు దూర‌మైపోతాన‌ని భావించి.. దానికి నో చెప్పాడు ఈ తెలుగబ్బాయి. ఒక‌వేళ అక్క‌డే లాక్ అయి పోతే తెలుగులో విజ‌య్ చేయాల్సిన సినిమాలు మ‌రో హీరోకు వెళ్లిపోతాయి. ఈ టైమ్ లో రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేక అద్భుత‌మైన ఆఫ‌ర్ ను కూడా వ‌దిలేసాడు ఈ కుర్ర హీరో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here