వినండోయ్.. అల్లువారి రామాయాణం.. 


తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ సినిమాల‌కు పెట్టింది పేరు అల్లు అర‌వింద్. అస‌లు ఇండ‌స్ట్రీ మార్కెట్ 40 కోట్లు స‌రిగ్గా లేని స‌మ‌యంలోనే మేన‌ల్లుడు రామ్ చ‌ర‌ణ్ తో 40 కోట్ల‌తో మ‌గ‌ధీర సినిమా చేసాడు అల్లు అర‌వింద్. ఆయ‌న ఇచ్చిన ధైర్యంతోనే తెలుగులో భారీ సినిమాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు మ‌రో సెన్సేష‌న‌ల్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు మెగా నిర్మాత‌. ఏకంగా 500 కోట్ల‌తో రామాయణం నిర్మించ‌బోతున్నాడు ఈ నిర్మాత‌. ఈయ‌న‌కు తోడు మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా కూడా నిర్మాణంలో భాగం పంచుకోనున్నారు. ఇది పూర్తిస్థాయి 3డి సినిమా. అయితే అల్లు అర‌వింద్ ఈ ప్రాజెక్ట్ ఏ ద‌ర్శ‌కుడితో తీస్తున్నాడు.. న‌టీన‌టులు ఎవ‌రు.. ఇవ‌న్నీ మాత్రం స‌మాధానం చెప్ప‌లేదు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇదే ఏడాది రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను అంత‌గా హాండిల్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు మ‌న ఇండ‌స్ట్రీలో ఎవ‌రున్నారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రామాయణాన్ని ఇప్ప‌టికే ఎన్నోసార్లు చూసిన ప్రేక్ష‌కులకు.. అల్లువారి రామాయ‌ణం ఎలా ఉండ‌బోతుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here