వినాయ‌క్ అంటే అంత చుల‌క‌నా..? 

VV Vinayak
ఇండ‌స్ట్రీ త‌త్వ‌మే అంత. హిట్ వ‌స్తే ఒక‌లా.. రాక‌పోతే  మ‌రోలా.. ఇక్క‌డ హిట్ ఉన్న‌పుడు నువ్వే దేవుడు అంటారు. లేదంటే నువ్వు ఎవ‌రు అంటారు. ఇప్పుడు వినాయ‌క్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఒక‌ప్పుడు ఈయ‌న ఒక్క ఛాన్స్ ఇస్తే బాగున్ను అని వేచి చూసిన హీరోలు ఇప్పుడు ఈయ‌న క‌నిపిస్తే ఎలా త‌ప్పించుకోవాలా అని చూస్తున్నారు. ఇంటిలిజెంట్ ఫ్లాప్ తో వినాయ‌క్ రేంజ్ బాగా ప‌డిపోయింది. ఈ చిత్ర ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ క‌నీసం 4 కోట్లు కూడా రాక‌పోవ‌డంతో మ‌నోడి రేంజ్ ఎలా దిగజారిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అస‌లు వినాయ‌క్ తో సినిమా అంటేనే ఇప్పుడు స్టార్ హీరోల‌కు కూడా వ‌ణుకు పుడుతుంది. దాంతో ఇప్పుడు వినాయ‌క్ నెక్ట్స్ ఏంటి అనేదానిపై అంద‌రి దృష్టి ప‌డింది. అస‌లు ఈయ‌న‌కు నిజంగానే ఇప్పుడు సినిమాలు చేసే మూడ్ ఉందా లేదంటే టైమ్ పాస్ కోసం చేస్తున్నాడా అనేది అర్థం కావ‌డం లేదు.
అఖిల్, ఇంటిలిజెంట్ లాంటి సినిమాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇప్పుడు ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనే అనుమానం కూడా వ‌స్తుందిప్పుడు. ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తుంటే వినాయ‌క్ ఇప్ప‌ట్లో సినిమాలు చేసే మూడ్ లో లేన‌ట్లు తెలుస్తుంది. సాయిధ‌రంతేజ్ సినిమాను కూడా పెద్ద‌గా ఆస‌క్తి లేకుండానే పూర్తి చేసాడు వినాయ‌క్. ఊహించ‌ని విధంగా ఈ చిత్రాన్ని కేవ‌లం 45 రోజ‌ల్లోనే తెర‌కెక్కించాడు. ఇదే సినిమా కొంప ముంచిందేమో అనిపిస్తుంది. ఆకుల శివ ఇచ్చిందే ప్ర‌సాదంగా ఏవేవో సీన్స్ పెట్టేసాడు వినాయ‌క్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి ఇమేజ్ త‌గ్గించేసింది. నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నాడ‌నే అనే ఆస‌క్తి రెండింత‌లు చేసింది. ఇప్ప‌టికైతే ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తాన‌ని అనౌన్స్ చేసాడు. మ‌రి చేస్తాడో.. ఇప్పుడున్న ఫామ్ చూసి ఎన్టీఆరే వ‌ద్దంటాడో మాత్రం తెలియ‌డం లేదు. మొత్తానికి చూడాలిక‌.. వినాయ‌క్ త‌ర్వాతి సినిమా ఎలా ఉండ‌బోతుందో.. ఎవ‌రితో ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here