విశాల్ ఏంటి అంత మాట అనేసాడు..!


విశాల్ అంటే ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీలో ఓ టైగ‌ర్. ఆయ‌న‌కు రీల్ ఇమేజ్ కంటే రియ‌ల్ ఇమేజ్ ఎక్కువైపోయింది. మిగిలిన స్టార్ హీరోలంతా కేవ‌లం తెర‌పై మాత్రమే హీరోలు. కానీ విశాల్ మాత్రం నిజంగానే హీరో. ఆయ‌న తెగింపు చూసి అంతా ఫిదా అవుతున్నారిప్పుడు.
మొన్న‌టికి మొన్న అర‌వ ఇండ‌స్ట్రీని మొత్తం ఏక‌తాటిపైకి తెచ్చి క్యూబ్ వాళ్ల మెడ‌లు వంచాడు విశాల్. ఇలాంటి హీరో ఇప్పుడు అజిత్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. ఈయ‌న మాట్లాడిన మాట‌లు ఇప్పుడు త‌మిళనాట వైర‌ల్ అవుతున్నాయి. స్టార్ హీరోల్లో అజిత్ చాలా మంచివాడ‌ని.. ఆయ‌న అడిగిన వెంట‌నే ఏదైనా చేస్తా డ‌ని.. అభిమానుల‌కు ఆయ‌న దేవుడ‌ని ప్ర‌శంసించాడు విశాల్. కానీ అదే అజిత్.. ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌లు చెప్పుకోడానికి సంప్ర‌దించాల‌ని వెళ్తే అస్స‌లు దొర‌క‌డ‌ని..
ఎక్క‌డుంటాడో జాడ కూడా తెలియ‌ద‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం. అజిత్ మంచివాడే కానీ అన్నింటికీ అందుబాటులో ఉంటే మంచిద‌ని చెబు తున్నాడు విశాల్. మ‌రోవైపు విజ‌య్ విష‌యంలో మాత్రం పాజిటివ్ గా స్పందించాడు విశాల్. విజ‌య్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని.. ఇప్ప‌టికీ డౌన్ టూ ఎర్త్ ఉంటాడ‌ని.. ఆయ‌న లాంటి హీరోను అరుదుగా చూస్తుంటాం అని చెప్పాడు విశాల్. అయితే ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై మాత్రం విజ‌య్ ను మ‌ధ్య‌లోకి తీసుకురాలేదు విశాల్. మొత్తానికి అజిత్ పై ఈయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు అభిమానుల్లో కాస్త అసంతృప్తిని ర‌గిలిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here