విశాల్ ప్రేయ‌సితో విజ‌య్ వైరం..


త‌మిళ ఇండ‌స్ట్రీతో కాస్త ట‌చ్ ఉన్న వాళ్ళు ఎవ‌రైనా విశాల్ ప్రేయ‌సి అంటే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆయ‌న‌కు సినిమా చూపిస్తా మావా రేంజ్ లో ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంది. ఇంత‌కీ ఎవ‌రా ప్రేయ‌సి అనుకుంటున్నారా..? శ‌ర‌త్ కుమార్ ముద్దుల కూతురు వ‌ర‌ల‌క్ష్మి. ఈమెతోనే కొన్నేళ్లుగా విశాల్ ప్రేమ క‌థ న‌డుస్తుంది.
అయితే అది ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పెళ్లి పీట‌లెక్క‌లేదు. శ‌ర‌త్ కుమార్ కు విశాల్ తో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగా ఈ ప్రేమ‌క‌థ‌కు ఇంకా శుభం కార్డ్ ప‌డ‌టం లేదు. అందుకే 38 ఏళ్లొచ్చినా విశాల్.. 35 ఏళ్లొచ్చినా వ‌ర‌ల‌క్ష్మి ఇంకా పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వ‌ర‌ల‌క్ష్మితో విజ‌య్ వైరం పెట్టుకుంటున్నాడు.
త‌మిళ‌నాట విజ‌య్ కు చాలా మంచి పేరుంది. ఎవ‌రితోనూ శ‌తృత్వం పెట్టుకోడని.. మ్యాగ్జిమ‌మ్ వివాదాల‌కు దూరంగా ఉంటాడ‌ని విజ‌య్ కు చాలా మంచి పేరుంది. కానీ ఇప్పుడు శ‌ర‌త్ కుమార్ కూతురు ర‌ల‌క్ష్మితో వైరం పెట్టుకుంటున్నాడు. అవును.. మీరు వింటున్న‌ది నిజ‌మే.
నిజంగానే ఇప్పుడు విజ‌య్ ఆమెతో శ‌తృత్వం పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ తో విజ‌య్ కు వైరం సినిమా కోస‌మే. ప్ర‌స్తుతం ఈయ‌న మురుగ‌దాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ రెండు పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నాడు. స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత మురుగ‌దాస్ చేస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో విల‌న్ల‌కు కొద‌వేం లేదు. ఇప్ప‌టికే ఇద్ద‌రు విల‌న్లు ఉన్నారు ఈ చిత్రంలో.
ఇప్పుడు మూడో విల‌న్ గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ చేరిపోయింది. ఈమెకు ఇప్పుడు హీరోయిన్ గా అవ‌కాశాలు చాలా క‌ష్టం. దాంతో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోతుంది. అందులోనూ విజ‌య్ లాంటి సూప‌ర్ స్టార్ సినిమాలో న‌టిస్తే క‌చ్చితంగా వ‌చ్చే క్రేజే వేరు. అందుకే మురుగ‌దాస్ సినిమా కోసం ప్ర‌తినాయ‌కురాలిగా మారిపోయింది వ‌ర‌ల‌క్ష్మి. ఈ పాత్ర కోస‌మే చాలా బ‌రువు త‌గ్గిపోయింది వ‌ర‌ల‌క్ష్మి. మ‌రి విజ‌య్ తో వైరం వ‌రానికి ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here