వెంకీ మామ అంటున్న నాగ‌చైత‌న్య‌..


తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్స్ హవా బాగానే న‌డుస్తుంది. క‌థ‌లు కుద‌రాలే కానీ అంతా ఇగోలు తీసి ప‌క్క‌న‌బెడుతున్నారు. ఇదే దారిలో ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, వెంక‌టేశ్ కూడా క‌లిసి న‌టించ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రూ నిజ జీవితంలో కూడా మామాఅల్లుళ్లే. ఇప్పుడు బాబీ ఈ ఇద్ద‌ర్ని క‌లిపే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి.. శైల‌జారెడ్డి అల్లుడు..
శివ‌నిర్వాణ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇక వెంక‌టేశ్ కూడా ఎఫ్ 2 చేస్తున్నాడు. వీటి త‌ర్వాత బాబీ సినిమా ఉండ‌బోతుంది. సినిమాలో కూడా ఈ ఇద్ద‌రూ మామాఅల్లుళ్లుగానే న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి వెంకీ మామా అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.
ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ర‌కుల్.. వెంకీకి జోడీగా కాలా ఫేమ్ హ్యూమా ఖురేషి న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే ఏడాది సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. గ‌తంలో ప్రేమ‌మ్ సినిమాలో కాసేపు చైతూకు మామ‌గా న‌టించాడు వెంకీ. ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్ లో క‌నిపించ‌డానికి రెడీ అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here