వెంకీ సినిమా ఆగ‌లేదంటోన్న నితిన్..


వెంక‌టేశ్ సినిమాకు నితిన్ తో సంబంధం ఏంటి..? ఈయ‌న సినిమా ఆగిపోలేద‌ని ఆయ‌న ఎలా చెబుతున్నాడు అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్క‌డ వెంకీ అంటే హీరో వెంక‌టేశ్ కాదు.. ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్యే ఛ‌లో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు వెంకీ కుడుముల‌. ఈ ఏడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది ఈ ద‌ర్శ‌కుడే. ఛ‌లోతో హిట్ కొట్టాడు. ఇప్పుడు రెండో సినిమాను నితిన్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు.
లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా ఫ్లాపుల త‌ర్వాత కూడా నితిన్ కెరీర్ మంచి జోరు మీదుంది. ప్ర‌స్తుతం స‌తీష్ వేగేశ్న‌తో శ్రీ‌నివాస క‌ళ్యాణం చేస్తున్నాడు నితిన్. ఈ చిత్రం షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఆగ‌స్ట్ 9న సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూతలు సినిమాకి కూడా క‌మిట‌య్యాడు నితిన్.
అయితే దీనికంటే ముందు వెంకీ కుడుముల‌ సినిమా ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు నితిన్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించ‌నున్నాడు. ఆగ‌స్ట్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌రి నితిన్ కోరుకుంటున్న హిట్ ఈ ద‌ర్శ‌కుడు అయినా ఇస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here