వెంక‌టేశ్ కు త‌మ‌న్నా.. సెట్ట‌వుతుందా..?

Venkatesh
అవును.. ఇప్పుడు ఇదే టాక్ న‌డుస్తుంది ఇండ‌స్ట్రీలో కూడా. వెంక‌టేశ్ లాంటి సీనియ‌ర్ హీరోకు జోడీగా త‌మ‌న్నాను అనుకుంటున్నారు. ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..? ప‌్ర‌స్తుతం తేజ సినిమాలో న‌టిస్తున్నాడు వెంక‌టేశ్. ఈ చిత్రంలో శ్రీ‌య హీరోయిన్ గా ఫైన‌ల్ అయింది. పైగా ఫోటో షూట్ కూడా జ‌రిగింది. ఈ చిత్రంతో పాటే అనిల్ రావిపూడి ఎఫ్ 2లోనూ న‌టించ‌బోతున్నాడు వెంకీ. ఈ చిత్ర పూర్తిపేరు ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్. వెంకీతో పాటు ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ను ఎంజాయ్ చేయ‌బోతున్న‌ది వ‌రుణ్ తేజ్. ఈ మ‌ల్టీస్టార‌ర్ ను దిల్ రాజు నిర్మించ‌నున్నాడు. ఇందులో వ‌రుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ ను తీసుకుంటున్నారు. రాజా ది గ్రేట్ తో క‌లిసొచ్చింది కాబ‌ట్టి ఆమెనే కంటిన్యూ చేస్తున్నాడు అనిల్. ఇక వెంక‌టేశ్ కు జోడీగా ముందు శ్రీ‌యాను అనుకుని ఇప్పుడు త‌మ‌న్నా వైపు అడుగేస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. శ్రీ‌య అయితే మ‌రీ రొటీన్ అయిపోతుంద‌ని భావించిన అనిల్ రావిపూడి.. కొత్త‌గా ఉంటుంద‌ని త‌మ‌న్నాను సెట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇప్పుడు త‌మ‌న్నాకు పెద్ద‌గా ఆఫ‌ర్లు కూడా లేవు. ఇలాంటి టైమ్ లో వెంక‌టేశ్ తో అవ‌కాశం అంటే చిన్న‌దేం కాదు. పైగా ఇప్పుడు త‌మ‌న్నా కూడా సీనియ‌ర్ హీరోయినే క‌దా..? అందుకే సీనియ‌ర్ హీరోతో జోడీకి రెడీ అవుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ జోడీ స్క్రీన్ పై ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here