వెంక‌టేశ్.. సునీల్.. ఓ రాఘ‌వేంద్రుడు..

sunil
అవును.. ఇదేదో కావాలని వేసిన లెక్కో.. కాకిలెక్కో కాదు.. నిజంగా రాఘ‌వేంద్ర‌రావ్ చెప్పిన లెక్క‌. ఈయ‌న కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. హాయిగా అప్పుడ‌ప్పుడూ టీవీలో క‌నిపిస్తూ.. ఏవో మాట‌లు చెప్పుకుంటున్నాడు. ఈయ‌న త‌న‌యుడు చేస్తోన్న సినిమాల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం.. రాజ‌మౌళి సినిమాల‌కు సూచ‌న‌లు ఇవ్వ‌డంతోనే కాలం గ‌డిపేస్తున్నాడు రాఘ‌వేంద్ర‌రావ్. ఆ మ‌ధ్య మోహ‌న్ బాబు హీరోగా రావ‌ణ అనే సినిమా ప్లాన్ చేసినా.. అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఓం న‌మో వెంక‌టేశాయా త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావ్ పూర్తిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. పైగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా వ‌చ్చి చాలా ఏళ్ల‌వుతుంది. చివ‌ర‌గా ఆయ‌న 2010లో మ‌నోజ్ తో ఝుమ్మంది నాదం చేసాడు. ఆ త‌ర్వాత పూర్తిగా ఆద్యాత్మిక సినిమాల‌కు ప‌రిమితం అయిపోయారు. శిరిడిసాయి.. ఓం న‌మో వెంక‌టేశాయా సినిమాలు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సినిమాలే ప్లాన్ చేసుకుంటున్నాడు రాఘవేంద్ర‌రావ్.
ఈ విషయాన్ని స్వ‌యంగా రాఘ‌వేంద్రుడే అనౌన్స్ చేసాడు. తాను త్వ‌ర‌లోనే రెండు సినిమాలు చేయ‌బోతున్నాని చెప్పాడు ఈ ద‌ర్శ‌క దిగ్గ‌జం. అవి కూడా ఆద్యాత్మిక సినిమాలే కావ‌డం విశేషం. అందులో ఓ సినిమాలో వెంకటేష్.. మ‌రో సినిమాలో సునీల్ హీరోలుగా న‌టిస్తార‌ని చెప్పాడు ఈ ద‌ర్శ కేంద్రుడు. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించి వర్క్ నడుస్తోందని.. పూర్తైన త‌ర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు రాఘ‌వేంద్ర‌రావ్. వెంకీ కానీ.. సునీల్ కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆధ్యాత్మిక సినిమాలు చేసింది లేదు. ఆ మ‌ధ్య సునీల్ హీరోగా త‌ణికెళ్ల భ‌ర‌ణి భ‌క్త‌క‌న్న‌ప్ప రీమేక్ చేస్తాన‌ని చెప్పాడు కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఇప్పుడు రాఘ‌వేంద్రుడు ఏదో ట్రై చేస్తానంటున్నాడు. మ‌రి హీరోగా మానేసి క‌మెడియ‌న్ గా వ‌స్తున్న సునీల్ తో ద‌ర్శ‌కేంద్రుడు ఏం చేస్తాడో..? ఇక సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అయిన వెంక‌టేశ్ తో ద‌ర్శ‌కేంద్రుడు ఏం సంచ‌ల‌నానికి తెర తీస్తాడో చూడాలిక‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here