వ‌రుడు త‌ర్వాత బ‌న్నీకి ఇదే..!

Allu Arjun
ఏ హీరోకైనా హిట్లు ఫ్లాపులు కామ‌న్. కానీ డిజాస్ట‌ర్లు మాత్రం అప్పుడ‌ప్పుడూ వ‌స్తుంటాయి. అల్లుఅర్జున్ విష‌యంలో మాత్రం డిజాస్ట‌ర్ల‌కు ప్రేమ కాస్త ఎక్కువే. అందుకే ఆయ‌న‌కు దూరంగానే ఉంటాయి. అప్పుడెప్పుడో చివ‌రిసారి 8 ఏళ్ల కింద వ‌రుడు రూపంలో ఓ డిజాస్ట‌ర్ వ‌చ్చింది. గుణ‌శేఖ‌ర్ తెర‌కె క్కించిన ఈ చిత్రం అప్ప‌ట్లో దారుణ‌మైన ఫ‌లితాన్ని చూసింది. న‌ష్టాల ప‌రంగా బ‌న్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయింది వ‌రుడు.
ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు అంత స్థాయిలో డిజాస్ట‌ర్ రాలేదు. మ‌ధ్య‌లో వేదం.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. బ‌ద్రీనాథ్ లాంటి ఫ్లాపులు వ‌చ్చినా డిజాస్ట‌ర్లు అయితే కావు. కొద్దో గొప్పో వ‌సూళ్లు సాధించాయి ఈ సినిమాలు. ఇక రేసుగుర్రం నుంచి ఈయ‌న‌కు ఫ్లాపులే లేవు. అన్నీ విజ‌యాలు.. యావ‌రేజ్ సినిమాలే. కానీ ఇప్పుడు నా పేరు సూర్య‌తో బ‌న్నీ జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ఈ చిత్రం రెండు వారాలు ముగిసేస‌రికి 49 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.
ఇక్క‌డితో సినిమా ఫుల్ ర‌న్ కూడా పూర్తైపోయింది. అంటే అక్ష‌రాలా బ‌య్య‌ర్ల‌కు 31 కోట్లు న‌ష్టం అన్న‌మాట‌. ఈ సినిమాను 80 కోట్ల‌కు పైగానే అమ్మే సారు. కేవ‌లం 65 శాతం మాత్ర‌మే రిక‌వ‌ర్ చేసి.. దారుణంగా బ‌య్య‌ర్ల‌ను ముంచేసాడు సూర్య‌. ఈ లెక్క‌న ఎనిమిదేళ్ళ త‌ర్వాత అల్లుఅర్జున్ కు దిమ్మ తిరిగే డిజాస్ట‌ర్ వ‌చ్చింద‌న్న‌మాట‌. మ‌రి దీన్నుంచి బ‌న్నీ ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here