వ‌రుణ్ మెగా కుటుంబం గ‌ర్వ‌ప‌డే సినిమా చేశాడు మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా  వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన `తొలిప్రేమ` చిత్రం  ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఉద‌యం మెగాస్టార్ చిరంజీవి  చిత్ర యూనిట్ స‌భ్యులు హీరో వ‌రుణ్ తేజ్, ద‌ర్శ‌కుడు వెంకీ, నిర్మాత వి.వి.ఎస్ .ఎన్ ప్ర‌సాద్, బాపినీడుల‌ను హైద‌రాబాద్ లోని త‌న ఇంటికి ఆహ్వానించి  స‌న్మానించారు.  అనంత‌రం
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` `తొలిప్రేమ`  పెద్ద స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా ఆల‌స్యంగా చూశాను. చూసి చాలా ఇన్ స్పైర్ అయ్యాను. నా బ్ర‌ద‌ర్  ప‌వ‌న్ `తొలిప్రేమ`  టైటిల్ తో   వ‌చ్చిన సినిమా అని  చాలా క్యూరియాసిటీ క‌ల్గింది. ఇదొక‌ కాంటెప్ర‌రరీ ల‌వ్ స్టోరీ.  క‌థ క‌న్నా సిచ్వేష‌న్ ల్ గానే సినిమా అంతా  ఉంటుంది.  ఇలా సినిమా చేయ‌డం డైరెక్ట‌ర్ కి చాలా పెద్ద  ఛాలెంజిగ్. సినిమా  ఇంత ప్రెష్ గా ఉందంటే కార‌ణం డైరెక్ట‌ర్ థాట్ వ‌ల‌నే. ఓ కొత్త కోణంలో సినిమా చూపించారు. ఇలాంటి  డైరెక్ట‌ర్స్ ఇండస్ర్టీకి రావాలి. ఇలాంటి ఇన్ పుట్స్….ఇన్ ప్యూజ్ కావ‌డం వ‌ల్ల  మ‌న ప‌క్క సినీ ప‌రిశ్ర‌మ‌లు మ‌న గురించి మాట్లాడుకుంటున్నాయి. తెలుగు ప‌రిశ్ర‌మ గ‌ర్వ‌ప‌డే సినిమా ఇది. న‌టీన‌టులంతా పాత‌వాళ్లే. కానీ అన్ని పాత్ర‌లు చాలా కొత్త‌గా క‌నిపించాయి. వ‌రుణ్ తేజ్  చాలా మెచ్యూర్డ్ గా న‌టించాడు. సినిమాలో త‌న‌ని చూస్తున్నంత సేపు ఎవ‌రో యంగ్ బాయ్ న‌టిస్తున్న‌ట్లు అనిపించింది. ప్రేమ స‌న్నివేశాలు…ఇగో క్లాషెస్ స‌న్నివేశాల్లో వ‌రుణ్, రాశీఖ‌న్నా చాలా ఇన్వాల్వ్ అయి  చేశారు. వ‌రుణ్ పెర్పామెన్స్ చూసి  మా ఫ్యామిలీ అంతా గ‌ర్వ‌ప‌డుతోంది.  వరుణ్ ఎత్తుకు  డాన్సులు ఎంత వ‌రకు కుదురుతాయ‌ని లోలోప‌ల అనుమానం ఉండేది. కానీ ప్ర‌తీ స్టెప్ ను బాగా అడాప్ట్ చేసుకుని చేశాడు.  అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను అల‌రించే క‌మ‌ర్శియ‌ల్  సినిమా ఇది. థ‌మ‌న్ సంగీతం చాలా బాగుంది.  కోరియోగ్రాఫ‌ర్  స‌తీష్, శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్సుల‌న్నింటినీ  సిచ్వేష‌న్ ల్ గా కంజోజ్ చేశారు. కెమెరా మెన్ జార్జ్ వ‌ర్క్ ప్ర‌శంస‌నీయం. వ‌రుణ్ ను మ‌రింత అందంగా,  రాశీ ఖ‌న్నా ను గ్లామ‌ర్ డాళ్ల్ గా చూపించారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్,  చ‌ర‌ణ్ అభిమానించే నిర్మాత‌. ఈ సినిమా కోసం  ఆయ‌న ఖ‌ర్చు కు ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌లేదు.  60 రో జుల్లోనే సినిమా పూర్తిచేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఈ స‌క్సెస్  నాగ‌బాబుకి  ప్రైడ్ మూమ్ మెంట్. వ‌రుణ్ వాళ్ల నాన్న‌కి మంచి బ‌హుమ‌తి ఇచ్చాడు` అని అన్నారు.
అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ` చిన్న‌ప్పుడు `స్టువ‌ర్ట్ పురం` పోలీస్ స్టేష‌న్ సినిమా టైమ్ లో చిరంజీగారిని చూశాను. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు చిరంజీవి గారి ప‌క్క‌న కూర్చుని మాట్లాడే అవ‌కాశం క‌లిగింది. ఈ అనుభూతి ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. చిరంజీవి గారు సినిమా చూసి న‌చ్చి మ‌మ్మ‌ల్ని ఇలా పిలిపించి మాట్లాడ‌టం చాలా సంతోషంగా..గ‌ర్వంగా  ఉంది` అని అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్ర‌సాద్ మాట్లాడుతూ, ` 33 ఏళ్ల క్రితం  సినిమాలు చేద్దామ‌ని మ‌ద్రాస్ వెళ్లాను. ఆ స‌మ‌యంలో ప‌సుపులేటి రామారావు గారు ద్వారా  చిరంజీవిగారి ఇంటికి వెళ్లాను. నిర్మాత‌క‌న్నా… అక్క‌డ ఓ అభిమానిగానే చిరంజీవిగారితో ప‌రిచ‌యం జ‌రిగింది. ఇన్నేళ్ల‌కు  రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌,  బన్నీ ఇప్పుడు వ‌రుణ్ తో సినిమా చేసే అవ‌కాశం ల‌భించింది. అన్ని పెద్ద హిట్ అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ, `నాకు యాక్ట‌ర్ అవ్వాల‌న్న ఆలోచ‌న చిరంజీవి గారిని చూసే వ‌చ్చింది. ఈ రోజు డాడి వ‌చ్చి మంచి మాట‌లు చెబుతుంటే చాలా సంతోషం గా ఉంది` అని అన్నారు.
థ‌మ‌న్ మాట్లాడుతూ, ` నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయ‌న మ‌మ్మ‌ల్ని గుర్తించి పిలిపించి….ప్ర‌శంసించ‌డం మాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇంట‌ర్ పాస్ అయి డిగ్రీకి వెళ్లున్న ఫీలింగ్ క‌ల్గుతుంది` అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here