శంక‌ర్ అది వ‌దిలేసి ఏం చేస్తున్నాడు..?

SHANKAR DIRECTOR 2.0 INDIAN 2
శంక‌ర్ తో సినిమా అంటే ఒక‌ప్పుడు హీరోలంతా ఎగిరి గంతేసేవాళ్లు కానీ ఇప్పుడు కాదు. ఈయ‌నతో పెట్టుకుంటే ఎప్ప‌టికి సినిమా పూర్తి అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు ర‌జినీకాంత్ ను చూస్తుంటే ఇది అర్థ‌మైపోతుంది. ఇదివ‌ర‌కు ఒక్కో సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటుంటే.. ఏమోలే ఏదో టైమ్ లో వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉండేది. కానీ ఇప్పుడు 2.0 ను చూస్తుంటే నిర్మాత‌లంద‌రికీ భ‌యం వేస్తుంది.
450 కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం విష‌యంలో శంక‌ర్ చూపిస్తున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆడియో విడుద‌లై ఆర్నెళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం ఎప్పుడొస్తుందో చెప్ప‌లేక‌పోతున్నాడు శంక‌ర్. పైగా ర‌జినీ కూడా అన్నీ వ‌దిలేసి కాలాతో బిజీ అయిపోయాడు.. ఆ త‌ర్వాత కార్తిక్ సుబ్బ‌రాజ్.. రాజ‌కీయాలు అంటున్నాడు. మ‌రి 2.0 ఎక్క‌డికి వెళ్లిన‌ట్లు..? ఇక శంక‌ర్ కూడా త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లుగా క‌మ‌ల్ హాస‌న్ తో తాను చేయ‌బోయే త‌ర్వాతి సినిమా ఇండియ‌న్ 2తో బిజీగా ఉన్నాడు.
ప్ర‌స్తుతం ఈ క‌థ సిద్ధం చేసే ప‌నిలోనే ఉన్నాడు శంక‌ర్. ఇదంతా చూస్తుంటే 2.0 ఈ ఏడాది కూడా రాద‌ని అర్థ‌మైపోతుంది. మ‌రిలాంటి ప‌రిస్థితుల్లో ఈ చిత్రంపై వంద‌ల కోట్లు పెట్టిన నిర్మాత ప‌రిస్థితేంటి..? ఏదేమైనా ఇప్పుడు శంక‌ర్ సినిమా అంటే హీరోల‌తో పాటు నిర్మాత‌ల‌కు కూడా భ‌య‌మేనండోయ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here