శృతిహాస‌న్ బ‌లుపు చూపిస్తుందా..?


అదేంటి స‌డ‌న్ గా అంత మాట అనేసారేంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం. ఇప్పుడు శృతి నిజంగానే బ‌లుపు చూపిస్తుంది. అయితే బ‌లుపు అంటే మీరు అనుకుంటున్న బ‌లుపు మాత్రం కాదు.. సినిమా బ‌లుపు అన్న‌మాట‌. ఒక్క‌సారి ఈమె గతంలోకి వెళ్తే.. బ‌లుపు అనే సినిమా ఒక‌టి చేసింది గుర్తుంది క‌దా..!
ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌య‌మే సాధించింది. మ‌ళ్ళీ ఇన్నాళ్ల‌కు అదే మాస్ రాజాతో ఇంకో సినిమా చేయ‌డానికి రెడీ అవుతుంది శృతిహాస‌న్. తెలుగులో చాలా కాలంగా సినిమాలు చేయ‌డం మానేసిన ఈ భామ‌.. ఇన్నాళ్ల‌కు క‌లిసొచ్చిన హీరోతోనే రొమాన్స్ చేయ‌బోతుంద‌ని తెలుస్తుంది. తెరీకి రీమేక్ గా ర‌వితేజ‌తో సంతోష్ శ్రీ‌నివాస్ సినిమా చేస్తోన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇందులో హీరోయిన్ గా ముందు కాజ‌ల్ ను అనుకున్నా ఇప్పుడు శృతిహాస‌న్ వైపు అడుగేస్తున్నార‌ని తెలుస్తుంది. పైగా మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన శృతి.. ఇప్పుడు అందాల‌ను బాగానే శృతి చేసింది. స‌న్న‌గా మారిపోయింది. ఓ షాపింగ్ మాల్ యాడ్ కోసం చేసిన ఫోటోషూట్ లో నాజూగ్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇది చూసి కుర్రాళ్లు కూడా ఓహో శృతి బాగానే చేసిందిగా అందాల‌కు అంటూ క‌మెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో విద్యుత్ జ‌మాల్ తో ఓ సినిమా ఒప్పుకున్న‌ ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు తెలుగులోనూ ఓ సినిమాకు సై అనేసింది. మ‌రి చూడాలిక‌.. ఈ బలుపు కాంబినేష‌న్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here