శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్ పై కుట్ర.. వర్మ మరో జిఎస్టి

 

శ్రీ రెడ్డి తన ఉద్యమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ను వారి అమ్మగారిని దారుణంగా దూషించి ఆ తర్వాత, ఫ్యాన్స్, సగటు ప్రేక్షకుడు, సినీ పెద్దలు, సమాజంలో ఇతర వ్యక్తుల నుండి వస్తున్న స్పందనకు తలొగ్గి క్షమాపణలు చెప్పేసింది.
దీని వెనుక కుట్రకోణం దాగి ఉందన్న విషయం సమాజానికి తెలిసిపోయి.. అది వై.సి.పి నా, టీ.డీ.పీ నా లేదా ఇద్దరు కలిసి చేసారా అని ప్రజలు ఆలోచిస్తున్న సమయంలో ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసి ఆమె వెనకున్న వ్యక్తులు తప్పించుకోవడంకోసం మళ్ళీ కొత్తనాటకంలోని ఎత్తుగడలో భాగమే పి.ఓ.డబ్ల్యు సంధ్య సింపుల్ గా ఆ అమ్మాయి ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఓ పెద్ద డైరెక్టరు ఫోనులో మెసేజులు పెట్టాడు అని హింట్ ఇచ్చి తప్పుకుంది, కానీ ఆ మెసేజులు ఏమిటో బయట పెట్టలేదు. ఆ తర్వాత, తమన్నా సింహాద్రి బయట పెట్టిన శ్రీ రెడ్డి ఫోన్ సంభాషణలో దీని వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు… నాకు డబ్బులిస్తానన్నాడు..కానీ తీసుకోలేదు.. కుట్ర జరుగుతుంది..దీని వెనుకాల పెద్దవాళ్ళునట్లుంది…మహా న్యూస్ మూర్తి కూడా టీ.ఆర్.పి రేటింగ్స్ కోసం చూసాడే తప్ప ఏమి చేయలేకపోయాడు అని చెప్పుకొస్తూ.. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడో చూస్తాను అనే పాయింట్ లో మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ ను పొలిటికల్ గా దెబ్బ తీసే ప్రయత్నమే ఎక్కువగా కనబడుతుంది తప్ప క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంపై శ్రద్ద ఎక్కడ కనబడట్లేదు.
ఇదే క్రమంలో వర్మ స్పందిస్తూ ఓ వీడియో పెట్టాడు.. ఆ అమ్మాయి తన కోపాన్ని బూతుగా ప్రదర్శించింది…అయినా అది పెద్ద బూతెంకాదే..ఇటీవలే ఓ సినిమాలో ఆ బూతు వాడితే అందరు పెద్ద హిట్ చేసారు. కత్తి మహేష్ ఓ బాధలో ఉన్న లేడీ మరో లేడీని అంటే తప్పేంటి అంటూ శ్రీ రెడ్డి ని సమర్ధించాడు.
వర్మ సురేష్ బాబు నుండి 5 కోట్లు వాసులు చేసి శ్రీ రెడ్డి కి ఉద్యమానికి ఫండ్ రూపంలో ఇద్దామనుకున్నాను అందులో తప్పేంటి అన్నాడు, పవన్ కళ్యాణ్ ని తిడితే ఉద్యమానికి ఊపు వస్తుందని సలహా ఇచ్చినట్లు కూడా చెప్పాడు. ఆర్.జి.వి అనే వాడు నైతిక విలువలు లేని వాడు అనే విషయం సమాజానికి తెలుసు.. దానికి ఉదాహరణే అతడు ఇటీవల తీసిన జి.ఎస్.టి అనే లఘు చిత్రం. అతను ఏ క్షణాన ఎటైనా మాట్లాడగలడు, మాట మార్చగలడు.. తర్వాత తూచ్ అనగలడు..మాట మీద నిలబడే తత్త్వం లేని వ్యక్తి…పవన్ ని మొదటి నుండి టార్గెట్ చేస్తున్న వ్యక్తి… అందుకనే రాజకీయ పార్టీలు సింపుల్ గా తప్పించుకోవడం కోసం ఏ క్షణాన ఎలాగైనా మాటమార్చగలిగే దిట్ట అయిన వర్మను ముందు పెట్టి అట్లాడించడం మొదలుపెట్టింది. అందుకనే ఆర్.జి.వి వచ్చి శ్రీ రెడ్డితో పవన్ ని తిట్టమంది నేనే… ఎవరైనా బాధపడితే సారీ అని సింపుల్ గా చెప్పేసాడు.
కానీ ఒకటి.. కుట్ర జరిపిన రాజకీయ పార్టీలను లేక తప్పుడు వ్యక్తులను కాపాడటానికి డబ్బు తీసుకొని అనైతిక విలువలతో బ్రతికే వ్యక్తిగా ఆర్.జి.వి కనిపిస్తున్నాడు. అతనికొచ్చిన నష్టంలేదు..అతనికి సిగ్గు లేదు.. ఇమేజ్ పోతుంది.. పరువు పోతుంది అనే భయంలేదు…మహా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తారు..అదీ అతనికి కొత్తేమీకాదు. నిజాయితీగా సమసమాజ లక్ష్యంతో ఒక కొత్త రాజకీయ శక్తి కు ప్రజల్లో పెరుగుతున్న నమక్కాన్ని తప్పుదోవ పట్టించడానికి
ఎప్పటినుండో పాతుకుపోయిన రెండు కుల రాజకీయ శక్తులు ఇంత నీచపు కపట, దిగజారుడు కుట్ర రాజకీయాలు చేయవలిసిన అవసరమేమిటో ఆ పార్టీలకు మద్దతు పలుకుతున్న సామాన్య ప్రజలు, మరీ ముఖ్యంగా పవన్ సామాజిక వర్గంవారు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం వచ్చింది.
– బయ్యవరపు రవి
పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్ర ను విశ్లేషిస్తూ ఓ అభిమాని రాసిన ఈ మెసేజు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here