శ్రీ‌మంతుడు ఔట్.. రంగ‌స్థ‌లం కొత్త రికార్డ్..

Rangasthalam TN
రంగ‌స్థ‌లం దూకుడు కొన‌సాగుతూనే ఉంది. సిట్టిబాబు దెబ్బ‌కు రికార్డుల రీ సౌండింగ్ న‌డుస్తూనే ఉంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో చాలా రికార్డులు తిర‌గ‌రాసిన ఈ చిత్రం ఇప్పుడు ఓవ‌ర్సీస్ లోనూ పంట పండిస్తుంది. అక్క‌డ 3 మిలియ‌న్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. ప్ర‌స్తుతానికి 2.9 మిలియ‌న్ ద‌గ్గ‌ర ఉన్న ఈ చిత్రం..
రెండో శ‌నివారం ఈ రికార్డ్ చేరుకోవ‌డం ఖాయ‌మైపోయింది. విడుద‌లైన 8 వ రోజు కూడా ల‌క్ష డాల‌ర్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇక వీకెండ్స్ లో మ‌ళ్లీ ర‌చ్చ చేయ‌డం ఖాయం. ఈ దూకుడు చూస్తుంటే 3.3-3.5 మిలియ‌న్ మ‌ధ్య‌లో రంగ‌స్థ‌లం ప్ర‌యాణం ఆగేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఇది సృష్టించిన రికార్డులు భ‌ర‌త్ అనే నేనుకు స‌వాల్ గా మారాయి.
ఇప్పుడు క‌చ్చితంగా మ‌హేశ్ త‌న స్టామినా నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ లో మార్కెట్ లేని చ‌ర‌ణ్.. ఇప్పుడు ఒకే సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ త‌న పేర రాసుకున్నాడు. మ‌రి చూడాలి.. చివ‌రి వ‌ర‌కు సిట్టిబాబు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో..? ఇప్ప‌టికే ఈ చిత్రం ఖాతాలో 82 కోట్ల షేర్ వ‌చ్చి చేరింది. 100 కోట్ల వైపు కూడా ప‌రుగులు తీస్తుంది రంగ‌స్థ‌లం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here