శ్రీ‌రెడ్డిపై నాని కూడా మొద‌లుపెట్టాడు..

NANNI SRI REDDY

పిచ్చుక‌పై బ్ర‌హ్మాస్త్రం వేయ‌డంలో అర్థం ఉండ‌దు. అన‌వ‌స‌రంగా వేసిన వాడి ప‌రువు పోతుంది. పిచ్చుక‌పై ఎవ‌డైనా ఇలా చేస్తాడా అంటూ రివ‌ర్స్ లో అటాక్స్ మొద‌ల‌వుతాయి. కానీ అప్ప‌టి వ‌ర‌కు ఆ పిచ్చుక చేసిన ర‌చ్చ‌ను మాత్రం ఎవ‌డూ ప‌ట్టించుకోడు. ఎంత‌సేపు ప‌డిన బ్ర‌హ్మాస్త్రాన్నే చూస్తారు కానీ పిచ్చుక వ‌ల్ల పాపం అవ‌త‌లివాడు ఎంత‌లా న‌ష్ట‌పోయాడు అని ప‌ట్టించుకోరు మ‌న జ‌నం. హ్యూమ‌న్ సైకాల‌జీ అంతే..

లారీ వ‌చ్చి స్కూట‌ర్ ను గుద్దితే స్కూట‌ర్ వాడిదే త‌ప్పు అవుతుంది. ఇప్పుడు ఇక్క‌డ కూడా అంతే. నానిపై కొన్ని రోజులుగా నాన్ స్టాప్ ర‌చ్చ చేస్తూనే ఉంది శ్రీ‌రెడ్డి. ఎవ‌డు వాడు.. ఎచ‌టి వాడు అంటూ రెచ్చిపోతుంది. ఒరేయ్ నాని నీ కాపురంలో నిప్పులే అంటుంది.. కులంతోనే నువ్వు ఎదిగావ్ అంటుంది.. న‌న్ను వాడు కున్నావ్ అంటుంది.. ఇలా ఎన్ని అన్నా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వ‌డం అని నాని కామ్ గానే ఉన్నాడు.

కానీ ఓపిక‌కు కూడా ఓ హ‌ద్దుంటుంది క‌దా.. ఇప్పుడు అది దాటిపోయింది నానికి. దాంతో శ్రీ‌రెడ్డికి లీగ‌ల్ నోటీసులు పంపించాడు. ఇక‌పై త‌న గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా త‌న‌లో మ‌రో మ‌నిషిని చూస్తావన్న‌ట్లు వార్నింగ్ ఇచ్చేసాడు న్యాచుర‌ల్ స్టార్. అంద‌రికీ ఫ్యామిలీస్ ఉంటాయి క‌దా.. అలా డిస్ట‌ర్బ్ చేయ‌డం మంచిది కాదు అంటున్నాడు నాని. త‌న గురించి ఎవ‌రు ఏం మాట్లాడినా కూడా స‌హ‌నంతో విన‌డం అల‌వాటైపోయింది అని.. ఇప్పుడు ఇలా రెచ్చిపోతుంటే ఉన్న స‌హ‌నం కూడా పోతుంద‌ని చెబుతున్నాడు ఈ హీరో. మ‌రి ఇన్నాళ్లూ శ్రీ‌రెడ్డి మాత్ర‌మే ర‌చ్చ చేసింది.. ఇప్పుడు నాని వైపు నుంచి యుద్ధం మొద‌లైంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here