శ‌ర్వానంద్ విరాట‌ప‌ర్వం 1992..

మ‌హాభార‌తంలో విరాట‌ప‌ర్వం అనేది ఒక‌టుంది. చ‌రిత్ర తెలిసిన వాళ్ల‌కు ఈ ప‌ర్వంతో కూడా ప‌రిచ‌యం ఉంటుంది. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఓ చిత్రం రాబోతుంది. నీదినాది ఒకేక‌థ సినిమా గుర్తుందా..? త‌మ ల‌క్ష్యాల‌న్నీ పిల్ల‌ల‌పై రుద్దొద్దు.. వాళ్ల‌కు న‌చ్చిన‌ట్లు బ‌త‌క‌నివ్వండంటూ చిన్న సైజ్ మెసేజ్ ఒక‌టి ఇచ్చాడు క‌దా.. ఆ ద‌ర్శ‌కుడే వేణు ఉడుగుల. ఈయ‌న ఇప్పుడు రెండో సినిమా కోసం పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీని న‌మ్ముకుంటున్నాడు.

హీరో హీరోయిన్లుగా శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌విని తీసుకుంటున్నాడు. ఇప్ప‌టికే ఈ జంట హను రాఘ‌వ‌పూడి ప‌డిప‌డి లేచే మ‌న‌సులో న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు శ‌ర్వా. ఇదిలా ఉంటే ఈ సినిమాలో న‌టిస్తున్న‌పుడే మ‌రో సినిమాలోనూ ప‌ల్ల‌వితో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో.

సాయిప‌ల్ల‌వికి ఉన్న ఆటిట్యూడ్ కు ఒక్క‌సారి ఆమెతో న‌టించ‌డ‌మే ఎక్కువ అని కొంద‌రు హీరోలు బాహాటంగానే అంటున్నారు. అలాంటిది ఇప్పుడు వ‌ర‌స‌గా ఆమెతో రెండో సినిమాకు కూడా సిద్ధం అవుతున్నాడు శ‌ర్వానంద్. 1990ల నేప‌థ్యంలో సాగే ఈ క‌థ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుందంటున్నాడు వేణు. మ‌రి చూడాలిక‌.. ఈ విరాట‌ప‌ర్వం 1992 ఎలా ఉండబోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here