షూటింగ్ పూర్తి చేసుకున్న కోటేంద్ర “బంగారి బాలరాజు”

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ..

డిసెంబర్ 11న షూటింగ్ ప్రారంభమై మొదటి షెడ్యూల్ అహోబిలం, కర్నూల్ రాక్ గార్డెన్, సోమశిల పరిసర ప్రాంతాలలో టాకీ మరియు 2పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని, రెండో షెడ్యూల్ హైదరాబాద్, పరిగి, అరకు, ఎదులాబాద్ పరిసర ప్రాంతాలలో మిగతా టాకీ, సాంగ్స్ చిత్రీకరణ తో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది.

బంగారి బాలరాజు కథ విషయానికి వస్తే… కర్నూలు జిల్లాలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా బంగారి బాలరాజు చిత్ర కథని రాసుకోవడం జరిగిందని, చిత్ర ఆడియో ఓ పెద్ద హీరో చేతుల మీదుగా త్వరలో విడుదల కాబోతుందని, చిత్రాన్ని మే 3వ వారం లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు కోటేoద్ర దుద్యాల తెలిపారు.

ఈ సందర్భం గా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ గారు మాకు కథ చెప్పగానే నచ్చి, వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశాము. కోటేంద్ర చెపినట్టుగా తెరకెక్కించడం జరిగింది. మే 3వ వారం లో సినిమాను విడుదల కి సన్నాహాలు చేస్తున్నాము. మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము అని తెలియజేసారు.

టెక్నిషియన్స్

కెమెరా : చక్రవర్తి

ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ

ఎడిటింగ్ : నందమూరి హరి

సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు

పాటలు : చిలకరెక్క గణేష్

ఫైట్స్ : రామ్ సుంకర

పి.అర్.ఓ : కడలి రాంబాబు ( KNS) KADALI MEDIA

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :

కోటేంద్ర దుద్యాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here