షో మొద‌లుపెట్టిన ప‌వ‌ర్ స్టార్..

Pawan Kalyan
మీ టిఆర్పీల‌కు మించిన షో నేను మీకు చూపిస్తానంటూ కొన్ని గంట‌ల ముందే ట్వీట్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. అప్పుడే ఆయ‌న షో మొద‌లైంది కూడా. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సైలెంట్ గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదంటున్నాడు. ఈయ‌న దూకుడు చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు.
అస‌లు ఇంత ప్రశాంతంగా ఉండే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు అంత‌గా ఊగిపోతున్నారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఇష్యూతో పాటు ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తోనూ మాట్లాడిన ప‌వ‌న్.. అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన మీటింగ్ లో కూడా కీల‌క‌మైన విష‌యాలు చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పోరాటం ఇక్క‌డితో ఆగ‌ద‌ని.. సుధీర్ఘ‌మైన న్యాయ‌పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్.
దానికితోడు టివి 9 శ్రీ‌నిరాజు పంపిన లీగ‌ల్ నోటీసుకు కూడా ప‌వ‌న్ ఏ మాత్రం బెద‌ర‌లేదు స‌రిక‌దా అది ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ శ్రీ‌ని అంటూ సెటైర్ కూడా వేసాడు. త‌న అభిమానుల‌ను అరెస్ట్ చేసిన పోలీసుల‌తో కూడా వాగ్వాదానికి దిగాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆ పిల్ల‌లు ఏం త‌ప్పు చేసార‌ని అరెస్ట్ చేసారంటూ మాట్లాడాడు. అమ్మ‌ను తిడితే కోపం రాదా.. ఎంత‌కాలం అని మౌనంగా భ‌రించాలంటూ రెచ్చిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఇప్ప‌ట్లో ప‌వ‌న్ చేస్తోన్న పోరాటానికి అడ్డుక‌ట్ట ప‌డేలా క‌నిపించ‌ట్లేదు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here