సంక్రాంతి 2018.. చివ‌రికి మిగిలిన‌వి ఇవే..!


ఇంకా 15 రోజులే.. సంక్రాంతి పండ‌క్కి ఇంకా ఉన్న‌ది రెండు వారాలే.. ఈ లోపే ఎవ‌రెవ‌రు రేస్ లో ఉన్నారో తేల్చుకోవాలి. అప్ప‌ట్లో చాలా మంది హీరోలు పోటీకి రెడీ అయ్యారు కానీ పండ‌గ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రేస్ త‌గ్గిపోయింది. ఇప్పుడు మిగిలింది న‌లుగురు హీరోలే. అందులోనూ స్టార్ హీరోలు ఇద్ద‌రే. ఓ డ‌బ్బింగ్ సినిమా కూడా లిస్ట్ లో ఉంది. మ‌రొక‌రు చిన్న హీరో. మొత్తంగా చూసుకుంటే 2018 సంక్రాంతి బాల‌య్య‌, ప‌వ‌న్ చుట్టూనే తిరుగుతుంది. చ‌ర‌ణ్ మ‌హేశ్ రేస్ నుంచి చాలా రోజుల కిందే త‌ప్పుకున్నారు.. వ‌స్తాన‌న్న ర‌వితేజ కూడా రావ‌ట్లేదు.. భాగ‌మ‌తి ప‌క్క‌కెళ్లిపోయింది.. దాంతో ఇప్పుడు పండ‌క్కి బాల‌య్య‌, ప‌వ‌న్ మాత్ర‌మే వ‌స్తున్నారు. అజ్ఞాత‌వాసి ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి 10న రావ‌డానికి సిద్ధంగా ఉంది. జ‌న‌వ‌రి 12న జై సింహా విడుద‌ల కానుంది. ఈ చిత్ర సెన్సార్ కూడా ఈ వార‌మే పూర్తి కానుంది. సూర్య న‌టించిన గ్యాంగ్ కూడా జ‌న‌వ‌రి 12నే విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌మిళ్ లో అదే రోజు విడుద‌ల కానుంది. అందుకే తెలుగులోనూ ఒకేరోజు విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లాన్. రాజ్ త‌రుణ్ రంగుల‌రాట్నం కూడా పండ‌క్కే వ‌స్తుంది. తాజాగా మ‌రోసారి పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్ర సంద‌డైతే క‌నిపించ‌ట్లేదు. దాంతో వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం లేదు. దాంతో ఇప్పుడు అఫీషియ‌ల్ గా పండ‌గ రేస్ లో ఉన్న సినిమాలు మూడే.. అవే అజ్ఞాత‌వాసి.. జై సింహా.. గ్యాంగ్. మ‌రి ఈ మూడు సినిమాల్లో ఏది విన్న‌ర్ గా నిలుస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here