సంఘ‌మిత్ర అస‌లు ల‌క్ష్యం ఏంటి..? 

ఇండియాలో ఇప్పుడు అంద‌రి ద‌ర్శ‌కుల దృష్టి బాహుబ‌లిపైనే ఉంది. ఓ రీజిన‌ల్ సినిమాగా మొద‌లై.. ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ గా మారిన బాహుబ‌లి ప్ర‌యాణం ప్ర‌తీ సినిమాకు ఆద‌ర్శ‌నీయం. ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు అనిపించుకోవాలంటే ఇప్పుడు చాలా ఈజీ. బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టి.. దాన్ని మించిన సినిమా చేస్తే చాలు.. నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు అయిపోతాడు. ఇప్పుడు ఈ టాస్క్ కోస‌మే సుంద‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈయ‌న సంఘ‌మిత్ర సినిమాను ఏకంగా 350 కోట్లతో ప్లాన్ చేస్తున్నాడు. ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ టెక్నీషియ‌న్ టీం ఈ సినిమా కోసం ప‌ని చేస్తోంది. త‌మిళ‌నాట చాలా పెద్ద సినిమాలు చేసిన ఈయ‌న‌.. ర‌జినీకాంత్ తో అరుణాచ‌లం లాంటి సెన్సేష‌నల్ హిట్ ఇచ్చాడు. ఈయ‌న 350 కోట్ల‌తో ఓ భారీ సినిమాకు క‌థ సిద్ధం చేసుకున్నాడు. సూర్య‌ను ముందు హీరోగా తీసుకున్నాడు.. ఆయ‌న నో చెప్పేసాడు. ఆ త‌ర్వాత మ‌హేశ్ ను సంప్ర‌దిస్తే ఇక్క‌డా నో అనే స‌మాధాన‌మే వ‌చ్చింది.
త‌మిళ్ సూప‌ర్ స్టార్ విజ‌య్ ను సంప్ర‌దిస్తే.. ఆయ‌న కూడా నో చెప్పిన‌ట్లు స్వ‌యంగా సుంద‌రే వివ‌రించాడు. నిర్మాత‌లు భ‌య‌ప‌డినా.. ఏదో ఒక‌టి చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసాడు సుంద‌ర్. స్టార్స్ కాద‌న్నా.. త‌న సంఘ‌మిత్ర సినిమాను జ‌యం ర‌వి, ఆర్య‌ల‌తో ప్లాన్ చేస్తున్నాడు సుంద‌ర్. హీరోయిన్ గా శృతిహాస‌న్ ను తీసుకున్నాడు. ఈమె హ్యాండిచ్చింది. త‌ర్వాత హ‌న్సిక అనుకున్నారు.. కానీ ఆమె కూడా త‌ప్పుకుంది. చేసేదేం లేక‌.. దిశాప‌టానితో స‌ర్దుకుపోదాం అనుకున్నాడు సుంద‌ర్. కానీ ఇప్పుడు ఈ భామ కూడా త‌ప్పుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ ఎవ‌రో తెలియ‌కుండా ఉంది ఈ చిత్రంలో. ఈ సినిమాలో భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉండ‌బోతున్నాయి. ఎలాగైనా బాహుబ‌లిని మ‌రిపించాల‌నేది ఈ ద‌ర్శ‌కుడి ధ్యేయం. చూడాలిక‌.. అస‌లు ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here