సంజూ ట్రైల‌ర్ టాక్.. ఓరి దేవుడో..!

SANJU TRAILER RELEASED
సంజ‌య్ ద‌త్.. ఈ ఒక్క పేరు చాలు.. ఎన్నో వివాదాలు మ‌రెన్నో విజ‌యాలు.. ఇంకెన్నో దారుణాలు. అన్నీ ఒకే జీవితంలో చూసాడు ఈ హీరో. సంచ‌ల‌నాల‌కు ఎప్పుడూ ద‌గ్గ‌రి చుట్టంగానే ఉన్నాడు సంజ‌య్ దత్. ఇప్పుడు ఈయ‌న జీవితం ఆధారంగా సినిమా వ‌స్తుంది. అదే సంజూ. అది కూడా ద‌త్ ప్రాణ స్నేహితుడు రాజ్ కుమార్ హిరాణీ చేస్తున్నాడు.
ఈయ‌న సినిమా అంటే బాక్సాఫీస్ కు భ‌య‌మే. వ‌చ్చిన ప్ర‌తీసారి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. పీకే త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా సంజూ. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ణ్ బీర్ క‌పూర్ హీరోగా న‌టించాడు. సంజ‌య్ ద‌త్ పాత్ర‌లో న‌టించ‌డం కాదు ఒదిగిపోయాడు ర‌ణ్ బీర్. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే అస‌లు ఈ బ‌యోపిక్ ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది.
సంజ‌య్ ద‌త్ జీవితంలో జ‌రిగిన ఏ చిన్న ఇష్యూను కూడా వ‌ద‌ల‌కుండా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో ట్రైల‌ర్ లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించాడు. ఇక ఆయ‌న డ్ర‌గ్ కు ఎలా అడిక్ట్ అయ్యాడు.. ఎందుకు అలా మారిపోయాడు.. దేశ‌ద్రోహానికి ఎందుకు పాల్ప‌డ్డాడు.. ఇలా ఏ విష‌యాన్ని కూడా దాచ‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. రాజ్ కుమార్ హిరాణీ సినిమా అంటే ఎలా ఉంటుంద‌ని ఊహిస్తామో అన్నీ ఉన్నాయి ఈ ట్రైల‌ర్ లో.
రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా సంజూ మ‌రో సంచ‌ల‌నం కావ‌డం ఖాయం అని అర్థ‌మైపోతుంది. ఇందులో సంజ‌య్ ద‌త్ తండ్రి సునీల్ ద‌త్ గా ప‌రేష్ రావ‌ల్.. త‌ల్లి న‌ర్గీస్ గా మ‌నీషా కొయిరాలా.. టినూమొనాయ్ గా సోన‌మ్ క‌పూర్.. ప్ర‌త్యేక పాత్ర‌లో అనుష్క శ‌ర్మ‌.. మాన్య‌త‌గా దియామిర్జా.. సంజ‌య్ స్నేహితుడు స‌ల్మాన్ ఖాన్ పాత్ర‌లో జిమ్ స‌ర‌భ్ న‌టిస్తున్నారు. జూన్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. చూడాలిక‌.. సంజుతో రాజ్ కుమార్ హిరాణీ ఎన్ని రికార్డుల‌కు చెక్ పెడ‌తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here