సరికొత్త పాత్రలో శ్రియ

Shriya-signs-a-women-centric-film
శ్రియ ముఖ్య పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైనది. సుజన దర్శకురాలిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడు జ్ఞాన శేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రంలో కటిక పేద కుటుంబానికి చెందిన అమాయకురాలైన యువతిగా శ్రియ నటించనున్నారు. ఇదివరకు ‘మిడ్నైట్ చిల్డ్రన్’ అనే హాలీవుడ్ చిత్రంలో ఆమె ఈ తరహా పాత్రలో కనిపించారు. సంగీతం ప్రధానంగా సాగే ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తారు. సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం మరో విశేషం. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చ్ నెల లో ప్రారంభం సెట్స్ పైకి వెళ్లనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here