సామి వ‌స్తున్నాడు.. మ‌హేశ్ లుంగీ డాన్స్..

Bharat Ane Nenu Song
అస‌లే చేస్తుంది పొలిటిక‌ల్ డ్రామా క‌దా..! ఈ రోజుల్లో చాలా మంది పొలిటీషియ‌న్స్ లుంగీలు ఎక్కువ‌గా క‌డుతుంటారు. పంచెక‌ట్టుతో వాళ్లంతా అల‌రిస్తుంటారు. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను కోసం మ‌హేశ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఎప్రిల్ 5 సాయంత్రం 5 గంట‌ల‌కు భ‌ర‌త్ అనే నేనులోని మూడో పాట విడుద‌ల కానుంది. వ‌చ్చేస్తున్నాడయ్యో సామీ అంటూ సాగే ఈ పాట‌లో మ‌హేశ్ మ‌రోసారి లుంగీ డాన్స్ చేస్తున్నాడు. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇది చూస్తుంటేనే పాట ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఇది కూడా మ‌హేశ్ సోలో సాంగే. అంటే ఈ సారి కూడా కైరా అద్వానికి ఎదురుచూపులు త‌ప్ప‌వు. ఎందుకంటే ఇప్ప‌టికే విడుద‌లైన తొలి రెండు పాట‌ల్లో కూడా కైరా అద్వానీ లేదు. మొద‌టిది భ‌ర‌త్ అనే నేనుథీమ్ సాంగ్.. రెండోది మ‌హేశ్ ఇంట్రో సాంగ్.. ఇప్పుడు మ‌ళ్లీ మిర్చిలో పండ‌గ‌లా దిగివ‌చ్చాడు త‌ర‌హా పాటే. దాంతో మ‌రోసారి హీరోయిన్ కు చుక్క‌లే. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ పాట ఎలా ఉండ‌బోతుందో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here