సాయిప‌ల్ల‌వి.. అప్పుడు ఇప్పుడు ఒక్క‌టే..!

saipallavi
ఇండ‌స్ట్రీలో తెలియ‌కుండానే కొన్ని సెంటిమెంట్స్ కు అల‌వాటు ప‌డిపోతుంటారు. సాయిప‌ల్ల‌వి విష‌యంలో ఇదే జ‌రుగుతుందిప్పుడు. ఈమె న‌టిస్తోన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. స‌రిగ్గా ఇదే తేదీ రోజు ఏడాది కింద ఎంసిఏ విడుద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయిన రోజే మ‌ళ్లీ ఏడాది త‌ర్వాత ఇంకో సినిమా వ‌స్తుంది. అది కూడా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుందే కావ‌డం విశేషం.
శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. 2018లో చివ‌ర‌గా రానున్న పెద్ద సినిమా ఇదే. హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ మ‌ధ్యే కోల్ క‌త్తా షెడ్యూల్ పూర్తి చేసిన ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు నేపాల్ లో చివ‌రి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఆస‌క్తిగా చూస్తున్నా అంటూ హ‌ను ట్వీటేసాడు. మొత్తానికి ఏడాది కింది ఎంసిఏ.. ఇప్పుడు ప‌డిప‌డి లేచే మ‌న‌సుతో వ‌స్తుంది సాయిప‌ల్ల‌వి. మ‌రి ఈ చిత్రంతో సాయిప‌ల్ల‌వి మ‌రోసారి హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here