సాయిప‌ల్ల‌వి.. నేనంతే అదోటైపు..

అవును.. ఇప్పుడు సాయిప‌ల్ల‌విని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో స్టార్స్ తో న‌టించి స్టార్ హీరోయిన్ అయిపోవాల‌ని ప్ర‌తీ హీరోయిన్ క‌లగంటోంది. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవ‌డానికి ఇది షార్ట్ క‌ట్. ఇలాంటి షార్ట్ క‌ట్ లు సాయిప‌ల్ల‌వికి ఇదివ‌ర‌కు చాలానే వ‌చ్చాయి. కానీ ఈమె కాద‌నుకుంది. మ‌ణిర‌త్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో పాటు అజిత్ లాంటి అగ్ర హీరోను కూడా వ‌ద్ద‌నుకుంది సాయిప‌ల్ల‌వి. ఇక కార్తితో న‌టించే ఛాన్స్ ను కూడా వ‌దిలేసుకుంది. చిన్న హీరోల‌తో న‌టించి.. త‌న‌కు మంచి పాత్ర‌లుండే సినిమాల్లోనే క‌నిపించి స్టార్ అవ్వాల‌నుకుంటుంద‌న్న‌మాట ఈ భామ‌. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇక‌పై కూడా అదే చేస్తానంటుంది సాయిప‌ల్ల‌వి.
తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ఈ భామ‌కు తెలుగు ప్రేక్ష‌కులంతా ఫిదా అయిపోయారు. ఒక్క సినిమాతో ఇంత ఇమేజ్ ఏ హీరోయిన్ కు వ‌చ్చుండ‌దేమో ఈ మ‌ధ్య కాలంలో. ఫిదాతో తెలుగులో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది ఈ భామ‌. రెండేళ్ల కింద మ‌ళ‌యాలంలోనూ తొలి సినిమాతోనే స్టార్ అయిపోయింది. అక్క‌డ ప్రేమ‌మ్ లో మ‌ల‌ర్ గా ఎలా మాయ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో భాన్సువాడ భానుమ‌తిగా ఫిక్స్ అయిపోయింది సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు నానితో ఎంసిఏ సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో బిజీగా ఉంది చిత్ర‌యూనిట్. డిసెంబ‌ర్ 21న సినిమా విడుద‌ల కానుంది ఎంసిఏ.
దాంతోపాటు క‌ణం సినిమాలోనూ న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. ఇందులో నాగశౌర్య హీరో అయినా.. అంద‌రి చూపు  మాత్రం సాయిప‌ల్ల‌విపైనే ఉంది. ఆమె ఉంది కాబ‌ట్టే సినిమాపై క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించ‌డానికి సాయిప‌ల్ల‌వి ఓకే చెప్పింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం దాగుడు మూత‌లు అని తెలుస్తుంది. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. ఒక‌రు సాయిప‌ల్ల‌వి కాగా.. మ‌రొక‌రు ర‌కుల్ అని తెలుస్తుంది. మొత్తానికి స్టార్స్ కు నో చెప్పి.. కుర్ర హీరోల‌తోనే న‌టిస్తూ తాను స్టార్ అవుతుంది ఈ హైబ్రిడ్ పిల్ల‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here