సావిత్రిని లెక్క చేయ‌ని రామ్ చ‌ర‌ణ్..

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో సోలో రిలీజ్ డేట్స్ దొర‌క‌డ‌మే క‌ష్టం. ఇప్పుడున్న టైమ్ లో క‌చ్చితంగా ఎవ‌రో ఒక‌రితో పోటీప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న కూడా మ‌హానటితో పోటీ ప‌డుతున్నాడు. రంగ‌స్థ‌లం ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ లోనే విడుద‌ల తేదీ కూడా అనౌన్స్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంతా ఊహించిన‌ట్లే ఫ‌స్ట్ లుక్ లో మాస్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు మెగా ప‌వ‌ర్ స్టార్. పైగా పంచెక‌ట్టు.. పైన ట‌వ‌ల్ తో ఊళ్లో ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. గెట‌ప్ కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాడు ఈ హీరో. సుకుమార్ కూడా చ‌రణ్ ను త‌న‌కు కావాల్సిన‌ట్లుగా మార్చుకోడానికి ఎన్నో లుక్స్ ట్రై చేసాడు. రంగ‌స్థ‌లం కోసం 15 లుక్స్ ప్ర‌య‌త్నిస్తే ఇది ఓకే అయింది. మార్చ్ 30న రంగ‌స్థ‌లం 1985 రానుంది. అంటే మ‌హాన‌టితో రామ్ చ‌ర‌ణ్ వార్ డిక్లేర్ చేసాడ‌న్న‌మాట‌. ముందు నుంచీ అనుకున్న‌దే కానీ ఇప్పుడు అఫీషియ‌ల్ గా యుద్ధం క‌న్ఫ‌ర్మ్ అయింది. ఇప్ప‌టికే రంగస్థ‌లం షూటింగ్ పూర్త‌యింది.. పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్. స‌మంత హీరోయిన్. చూడాలిక‌.. రంగ‌స్థ‌లం ర‌చ్చ ఏం రేంజ్ లో ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here