సాహోరే.. అన్నీ అబ‌ద్ధాలే..!

'Saaho'-Shoot-Recommences-From-Tomorrow
ప్ర‌భాస్ సాహో విష‌యంలో చాలా క‌న్ఫ్యూజ‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని 200 కోట్ల‌తో తెర‌కెక్కిస్తున్నారనే క్లారిటీ ఉంది కానీ షూటింగ్ విష‌యంలో మాత్రం ప్రేక్ష‌కుల‌ను.. అభిమానుల‌ను కావాల్సినంత క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ముఖ్యంగా దుబాయ్ షెడ్యూల్ విష‌యంలో.. ఓ సారి ఉందంటున్నారు మ‌రోసారి లేదంటున్నారు. కానీ ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీగా చెప్ప‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు దుబాయ్ షెడ్యూల్ ఉంది అన్నారు.. కానీ ఆ త‌ర్వాత ప‌ర్మిష‌న్స్ రాలేదు రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేస్తున్నామ‌ని చెప్పారు. కానీ ఇప్పుడేమో ఆ సినిమా విల‌న్ నీల్ నితిన్ ముఖేష్ మాత్రం అంతా అబ‌ద్ధం.. ఏదీ న‌మ్మ‌కండి.. మేం దుబాయ్ వెళ్తున్నాం.. బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర తాను, ప్ర‌భాస్ పెద్ద యుద్ధ‌మే చేయ‌బోతున్నాం అంటున్నాడు. మ‌రి ఈ చిత్రంలో న‌టించే న‌టుడే దీన్ని క‌న్ఫ‌ర్మ్ చేసిన‌పుడు ఏది న‌మ్మాలో తెలియ‌క క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయారు అభిమానులు. మ‌రోవైపు ఆర్ఎఫ్సీలో మాత్రం సాహో కోసం భారీ సెట్ వేస్తున్నాడు స‌బు సిరిల్.
నిజానికి దుబాయ్ షెడ్యూల్ కోసం చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌ర్లేదు. దుబాయ్ లో ఈ సినిమాకు భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఇప్ప‌టికే సుజీత్ తో పాటు సినిమాటోగ్ర‌ఫ‌ర్ మ‌ది.. స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బేట్స్ లొకేష‌న్లు చూసొచ్చారు. కానీ అక్క‌డి అనుమతులు రావ‌డం ఆల‌స్యం అయ్యేస‌రికి ఇప్ప‌టి వ‌ర‌కు దేశం దాటలేదు ఈ చిత్ర‌యూనిట్. ఇప్పుడు ఏకంగా 60 రోజుల పాటు అక్క‌డే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు సుజీత్. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ అయితే లేదు. ముఖ్యంగా దుబాయ్ లోని బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర చిత్రీక‌రించ‌బోయే 20 నిమిషాల యాక్ష‌న్ సీక్వెన్స్ ఇండియ‌న్ సినిమాల్లోనే నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్లుగా ఉంటుందంటున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఈ చిత్రం క‌చ్చితంగా ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో బెస్ట్ యాక్ష‌న్ మూవీగా నిలిచిపోతుంద‌ని భావిస్తున్నారు. 2019 స‌మ్మ‌ర్ కు  సాహో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ క‌న్ఫ్యూజ‌న్ కు తెర‌దించేది ఎవ‌రో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here