సుకుమార్ కు షాకిచ్చిన కుమారి..


కుమారి 21 ఎఫ్.. ఈ పేరు వింటే వెంట‌నే గుర్తొచ్చే పేరు హెబ్బాప‌టేల్. సొంత పేరును కూడా మ‌రిచిపోయి ఇప్ప‌టికీ కుమారి అంటారు ఈ భామ‌ను. కుమారి 21 ఎఫ్ కు ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్ అయినా కూడా దానికి క‌ర్త‌క‌ర్మ‌క్రియ అన్నీ సుకుమార్. ఈ క‌థ.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ రాసిందీయ‌నే. నిర్మాత కూడా సుకుమారుడే. అప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో బిజీగా ఉండి ఆ బాధ్య‌త‌ను త‌న శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ కు అప్ప‌చెప్పాడు సుకుమార్. కుమారి 21 ఎఫ్ తో హెబ్బాప‌టేల్ ను రాత్రికి రాత్రే స్టార్ ను చేసాడు సుకుమార్. అలాంటి ద‌ర్శ‌కుడికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉండాలి ఈ భామ‌. కానీ ఇప్పుడు రుణం తీర్చుకునే టైమ్ వ‌చ్చినా కూడా కాద‌నేసింది హెబ్బాపటేల్. రంగ‌స్థ‌లంలో ఓ పాత్ర కోసం అడిగితే సింపుల్ గా నో చెప్పి సుకుమార్ ను హ‌ర్ట్ చేసింది కుమారి. రంగ‌స్థ‌లంలో అన‌సూయ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ పాత్ర‌కు ముందు హెబ్బాప‌టేల్ ను అనుకున్నాడు సుకుమార్. దానికోసం ఆమెను అడిగాడ‌ని తెలుస్తుంది. కానీ పాత్ర మ‌రీ చిన్న‌ది కావ‌డంతో హెబ్బా ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి నో చెప్పేసింది. ఈమె కాద‌న్న త‌ర్వాతే ఆ పాత్ర‌ను అన‌సూయ‌కు ఇచ్చాడు సుకుమార్. కానీ కుమారి కాద‌న‌డం మాత్రం నిజంగా ఆలోచించాల్సిన విష‌య‌మే. పాత్ర మ‌రీ చిన్న‌ది కావ‌డంతో అలాంటి కారెక్ట‌ర్ చేస్తే కెరీర్ పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డి లైఫ్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి కూడా నో చెప్పింది హెబ్బాప‌టేల్. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత అన‌సూయ పాత్ర పేలితే.. అది చూసి హెబ్బా ఫీల్ అవ్వాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here