సుకుమార్ నెక్ట్స్ హీరో దొరికేసాడు..

అదేంటి.. ఓ సినిమా పూర్తైన త‌ర్వాత ఆర్నెళ్లు ఆలోచించి కానీ ఓ నిర్ణ‌యానికి రాడు క‌దా మ‌న సుకుమారుడు.. అలాంటిది రంగ‌స్థ‌లం విడుద‌ల‌కు ముందే హీరోను ఎంచుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు కూడా అలాంటి విచిత్ర‌మేమీ జ‌ర‌గ‌లేదు.
కాక‌పోతే సుకుమార్ నెక్ట్స్ సినిమా హీరో మాత్రం క‌న్ఫ‌ర్మ్ అయిపోయాడు. ఆయ‌న మరెవ‌రో కాదు ఆది. ఆది అంటే సాయికుమార్ త‌న‌యుడు కాదు.. ఆది పినిశెట్టి. ఈ టాలెంటెడ్ హీరోతోనే త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాడు సుకుమార్. అయితే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో మాత్రం కాదు.
సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో ఆదితో ఓ సినిమా నిర్మించ‌బోతున్నాడు. దానికి క‌థ‌, మాట‌లు కూడా సుకుమార్ అందించ‌బోతున్నాడు. భం భోలేనాథ్ లాంటి సినిమా చేసిన కార్తిక్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఆదికి క‌థ చెప్ప‌డం..
ఆయ‌న ఓకే చెప్ప‌డం కూడా జ‌రిగిపోయాయి. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే రంగ‌స్థ‌లంలో ఆది కీక‌ల‌మైన పాత్ర‌లో న‌టించాడు. అది రామ్ చ‌ర‌ణ్ అన్న‌య్య కుమార్ బాబు పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇందులో ఆది ప‌ర్ఫార్మెన్స్ న‌చ్చి త‌న నిర్మాణంలో ఆఫ‌ర్ ఇచ్చాడు సుకుమార్. మ‌రి ఈ సినిమాతోనైనా తెలుగులో హీరోగా ఆది నిల‌దొక్కుకుంటాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here