సునీల్ “2 కంట్రీస్” సెన్సార్ కంప్లీట్ డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల

2 COUNTRIES Censor Clean U – Release On Dec 29th
దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం “2 కంట్రీస్”. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ అందుకొని డిసెంబర్ 29న విడుదలకు సన్నద్ధమవుతోంది.
మలయాళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “2 కంట్రీస్”కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించింది. అద్భుతమైన కంటెంట్ తో సినిమాలు తీయగల దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు, “జై బోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం, జయం మనదేరా” వంటి చిత్రాలతో తనదైన మార్క్ వేసిన శంకర్ “2 కంట్రీస్”తో మరోమారు ఆడియన్స్ ను అలరించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ.. “అధికశాతం షూటింగ్ అమెరికాలో చేయబడడమే కాక గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కిన ఎంటర్ టైనింగ్ ఫిలిమ్ “2 కంట్రీస్”. సునీల్ కామెడీ టైమింగ్, స్టోరీ నేరేషన్ హైలైట్స్ గా ఈ చిత్రం రూపొందింది. అలాగే.. 30 ఇయర్స్ పృధ్వీ, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక గోపీసుందర్ ఆర్.ఆర్ సినిమాలోని ఎమోషన్స్ ను హైలైట్ చేస్తుంది. “2 కంట్రీస్” ప్రేక్షకుల్ని అమితంగా ఎంటర్ టైన్ చేస్తుందన్న పూర్తి నమ్మకం మాకుంది. సెన్సార్ పూర్తయ్యింది, డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.
సునీల్, మనీషా రాజ్, నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ, సాయాజీ షిండే, దేవ్ గిల్, కృష్ణభగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సీతారా, రాజా రవీంద్ర, శిజు, సంజన, శివారెడ్డి, ప్రవీణ, హర్షిత, శేషు, చమ్మక్ చంద్ర, రచ్చరవి, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, కో-డైరెక్టర్: కె.విజయసారధి, కళ: ఏ.ఎస్.ప్రకాష్, మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రాఫర్: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీ సుందర్, స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: ఎన్.శంకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here